హైద్రాబాద్‌కి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ: బేగంపేటలో ఘన స్వాగతం

Published : May 26, 2022, 01:05 PM ISTUpdated : May 26, 2022, 01:09 PM IST
 హైద్రాబాద్‌కి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ: బేగంపేటలో ఘన స్వాగతం

సారాంశం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం నాడు మధ్యాహ్నం  బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్, తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు సవాగతం పలికారు.

హైదరాబాద్: ప్రధానమంత్రి Narendra Modi గురువారం  నాడు మధ్యాహ్నం హైద్రాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ISB  20వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు గాను ప్రధాని మోడీ హైద్రాబాద్ కు వచ్చారు. Begumpet ఎయిర్ పోర్టులో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్,  కేంద్ర మంత్రి కకిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ లు స్వాగతం పలికారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అభ్యర్ధన మేరకు  మోడీ తన పర్యటనలో మార్పు చేసుకున్నారు. మధ్యాహ్నం 1:20 గంటలకు హైద్రాబాద్ కు చేరుకోవాల్సి ఉంది. అయితే పార్టీ వినతి మేరకు 12:50 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రధానమంత్రి మోడీ ప్రసంగించారు.

ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు  వచ్చారు.  గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్,  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా పలువురు  మోడీకి స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌సీయూ క్యాంపస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 2 గంటల సమయంలో ఐఎస్‌బీకు వెళ్తారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాజీ ప్రధాని దేవేగౌడతో సమావేశం కావడం కోసం బెంగుళూరుకు వెళ్లారు. ఇవాళ సాయంత్రం  కేసీఆర్ హైద్రాబాద్ కు తిరిగి వస్తారు.  మధ్యాహ్నం 3.15 గంటల వరకు ఐఎస్‌బీ కాన్వొకేషన్‌లో పాల్గొని సందేశమివ్వడంతోపాటు గ్రాడ్యుయేట్లకు గోల్డ్‌ మెడల్స్​, సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు మోడీ.

ఈ కార్యక్రమంలో 35 నిమిషాలు ప్రధాని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి హెచ్‌సీయూలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 3.50 బేగంపేట ఎయిర్‌‌‌‌పోర్టుకు చేరుకుని.. 3.55కు ప్రత్యేక విమానంలో చెన్నైకి బయల్దేరుతారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన‌‌‌ నేపథ్యంలో హైదరాబాద్‌‌‌‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐఎస్‌‌‌‌బీ ప్రాంగణాన్ని స్పెషల్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ (ఎస్‌‌‌‌పీజీ) ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకుంది. 

also read:PM Modi Hyderabad visit: ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌.. ట్విట్ట‌ర్ లో #గోబ్యాక్ మోడీ ట్రెండింగ్‌.. ఏం జ‌రుగుతోంది?

ఐఎస్‌‌‌‌బీ పరిసరాల్లోని 5 కి.మీ. మేర బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు నో ఫ్లై జోన్‌‌‌‌గా ప్రకటించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌‌లో అనుమతి ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నారు. మరోవైపు గచ్చిబౌలి పరిసరాల్లో సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్