మోడీని కలిసేందుకు భయపడుతున్నాడు: కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

Published : May 26, 2022, 12:30 PM IST
మోడీని కలిసేందుకు భయపడుతున్నాడు: కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

సారాంశం

రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రధాని మోడీతో కేసీఆర్ చర్చించకుండా బెంగుళూరుకు వెళ్లి ఏం చేస్తాడని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. మోడీని కలిసేందుకు కేసీఆర్ కు ముఖం లేదని ఆయన మండిపడ్డారు.   


హైదరాబాద్: ప్రధాని మోడీని కలిసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ముఖం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించార. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం నాడు బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద మీడియాతో మాట్లాడారు. 

Telangana రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రధానితో చర్చించవచ్చు  కదా అని Bandi Sanjay ప్రశ్నించారు. ప్రధాని Narendra Modi హైద్రాబాద్ కు వచ్చే సమయాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర అభివృద్ది పనుల కోసం ఉపయోగించుకోకుండా బెంగుళూరుకు పోయి KCR  ఏం చేస్తాడని బండి సంజయ్ ప్రశ్నించారు.  ప్రధాని మోడీ హైద్రాబాద్ కు వస్తుంటే ఆయనను కలవడానికి కేసీఆర్ కు ముఖం లేదా అని బండి సంజయ్ అడిగారు.  

also read:తెలంగాణకిచ్చిన హామీలపై మోడీకి ప్రశ్నలు: హైద్రాబాద్ లో 17 చోట్ల బ్యానర్లు

మోడీ వస్తున్నాడని తెలిసి కేసీఆర్ పారిపోతున్నాడని బండి సంజయ్ విమర్శించారు. ఏదో తప్పు చేసినందునే కేసీఆర్ మోడీకి ముఖం చూపించడానికి  భయపడుతున్నాడని బండి సంజయ్ చెప్పారు.  మోడీ Hyderabad కు వస్తున్నాడంటే ఒక్కసారి ఢిల్లీకి, ఒక్కసారి బెంగుళూరుకు, మరోసారి  కేసీఆర్ కు జ్వరం వస్తుందని బండి సంజయ్ సెటైర్లు వేశారు. బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చే కార్యకర్తలను ఆపవద్దని కూడా ఆయన పోలీసులను కోరారు. ప్రధాని మోడీని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటని కూడా బండి సంజయ్ ప్రశ్నిచారు.ఏక్తా యాత్రలో చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని కూడా బండి సంజయ్ చెప్పారు.మసీదులను తవ్వితే శివలింగాలు వచ్చింది వాస్తవం కాదా అని ఆయన అడిగారు.

మోడీ హైద్రాబాద్ టూర్ షెడ్యూల్

ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 1.25 గంటలకు బేగంపేట ఎయిర్‌ పోర్టుకు చేరుకొంటారు. . గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్,  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా పలువురు  మోడీకి స్వాగతం పలకనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌సీయూ క్యాంపస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 2 గంటల సమయంలో ఐఎస్‌బీకు వెళ్తారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాజీ ప్రధాని దేవేగౌడతో సమావేశం కావడం కోసం బెంగుళూరుకు వెళ్లారు. ఇవాళ సాయంత్రం  కేసీఆర్ హైద్రాబాద్ కు తిరిగి వస్తారు.  మధ్యాహ్నం 3.15 గంటల వరకు ఐఎస్‌బీ కాన్వొకేషన్‌లో పాల్గొని సందేశమివ్వడంతోపాటు గ్రాడ్యుయేట్లకు గోల్డ్‌ మెడల్స్​, సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు మోడీ.

ఈ కార్యక్రమంలో 35 నిమిషాలు ప్రధాని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి హెచ్‌సీయూలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 3.50 బేగంపేట ఎయిర్‌‌‌‌పోర్టుకు చేరుకుని.. 3.55కు ప్రత్యేక విమానంలో చెన్నైకి బయల్దేరుతారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన‌‌‌ నేపథ్యంలో హైదరాబాద్‌‌‌‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐఎస్‌‌‌‌బీ ప్రాంగణాన్ని స్పెషల్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ (ఎస్‌‌‌‌పీజీ) ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకుంది. 

ఐఎస్‌‌‌‌బీ పరిసరాల్లోని 5 కి.మీ. మేర బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు నో ఫ్లై జోన్‌‌‌‌గా ప్రకటించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌‌లో అనుమతి ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నారు. మరోవైపు గచ్చిబౌలి పరిసరాల్లో సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రధాని మోడీకి బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలుకుతారు. బీజేపీ క్యాడర్ తో మోడీ కొద్దిసేపు మాట్లాడే అవకాశం ఉంది. 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu