ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైద్రాబాద్ పర్యటనకు ముందే పలు ప్రశ్నలు సంధిస్తూ బ్యానర్లను ఏర్పాటు చేశారు. నగరంలోని 17 చోట్ల బ్యాానర్లను ప్రదర్శించారు.
హైదరాబాద్: ISB వార్షికోత్సవంలో పాల్గొనేందుకు గాను Hyderabad కు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నిస్తూ 17 చోట్ల బ్యానర్లు ఏర్పాటు చేశారు.హైద్రాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లలో ఈ Bannersను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు మెడికల్ కాలేజీలు ఇవ్వలేదని ప్రశ్నించారు.ఇండియన్ మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సెంటర్ Telanganaకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ ఓయూలో బ్యానర్ ఏర్పాటు చేశారు.హుస్సేన్ సాగర్ వద్ద ఢిఫెన్స్ కారిడార్ ఎందుకు ఇవ్వలేదని బ్యానర్ పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదాను కల్పించలేదని ప్రశ్నిస్తూ మరో బ్యానర్ ను హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేశారు.. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని ప్రశ్నిస్తూ కూడా రైల్వే లైన్ వద్ద బ్యానర్ కట్టారు.
also read:తెలంగాణలో అవినీతిపై సీబీఐ విచారణ ఎందుకు చేయడం లేదు: మోడీకి రేవంత్ రెడ్డి లేఖ
undefined
నవోదయ స్కూల్స్ ఏమాయ్యాయని ప్రశ్నిస్తూ బ్యానర్లు కట్టారు. Nizambad లో పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నిస్తూ మరో చోట బ్యానర్ ఏర్పాటు చేశారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామనే హామీ ఏమైందని ప్రశ్నించారు.ఐఐటీఆర్ ప్రాజెక్టు ఏమైందని ఆయన అడిగారు. మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసులు చేసినా కూడా నిధులు ఇవ్వని విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ జల మండలి వద్ద బ్యానర్లు కట్టారు.
రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రంపై రాష్ర ప్రభుత్వం చాలా కాాలంగా విమర్శలు చేస్తుంది. టీఆర్ఎస్ చీఫ్, సీఎం KCR అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతుందని కూడా గతంలో పలుమార్లు తెలంగాణ సర్కార్ విమర్శలు చేసింది.
అయితే ఇవాళ ప్రధాన మంత్రి మోడీ హైద్రాబాద్ కు వస్తున్న తరుణంలో కేంద్రం తీరును ప్రశ్నిస్తూ బ్యానర్లు కట్టడం చర్చనీయాంశమైంది. ప్రధాని మోడీకి స్వాగతం పలికే కార్యక్రమానికి కూడా కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారంగా తెలంగాణ సీఎం ఇవాళ బెంగుళూరుకు వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ ప్రధాని మోడీకి తెలంగాణ ప్రభుత్వం తరపున స్వాగతం పలకనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 1.25 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకొంటారు. . గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా పలువురు మోడీకి స్వాగతం పలకనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌సీయూ క్యాంపస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 2 గంటల సమయంలో ఐఎస్‌బీకు వెళ్తారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాజీ ప్రధాని దేవేగౌడతో సమావేశం కావడం కోసం బెంగుళూరుకు వెళ్లారు. ఇవాళ సాయంత్రం కేసీఆర్ హైద్రాబాద్ కు తిరిగి వస్తారు. మధ్యాహ్నం 3.15 గంటల వరకు ఐఎస్‌బీ కాన్వొకేషన్‌లో పాల్గొని సందేశమివ్వడంతోపాటు గ్రాడ్యుయేట్లకు గోల్డ్ మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు మోడీ.
ఈ కార్యక్రమంలో 35 నిమిషాలు ప్రధాని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి హెచ్‌సీయూలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 3.50 బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. 3.55కు ప్రత్యేక విమానంలో చెన్నైకి బయల్దేరుతారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐఎస్‌బీ ప్రాంగణాన్ని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకుంది.
ఐఎస్‌బీ పరిసరాల్లోని 5 కి.మీ. మేర బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో అనుమతి ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నారు. మరోవైపు గచ్చిబౌలి పరిసరాల్లో సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రధాని మోడీకి బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలుకుతారు. బీజేపీ క్యాడర్ తో మోడీ కొద్దిసేపు మాట్లాడే అవకాశం ఉంది.