Hyderabad: ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం మహబూబ్ నగర్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ఈ సభ నుంచే బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది. అయితే, ప్రధాని పర్యటనపై అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు మోడీకి లేదని మండిపడుతోంది.
PM Modi's Telangana Visit-BRS: ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీజేపీపై అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు మోడీకి లేదని మండిపడుతోంది. మోడీ పర్యటనకు ఒక రోజు ముందు బీఆర్ఎస్ తెలంగాణను అవమానించిన తర్వాత రాష్ట్రంలో పర్యటించే నైతిక హక్కు ఆయనకు లేదని వాల్ పోస్టర్లు అంటించింది. రాష్ట్ర ఆవిర్భావాన్ని అవమానించిన మోడీకి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ హైదరాబాద్ లో అతికించిన పోస్టర్లలో పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పాటుపై వివిధ సందర్భాల్లో పార్లమెంటులో మోడీ మాట్లాడిన నాలుగు వేర్వేరు చిత్రాలను ఈ పోస్టర్లలో పొందుపరిచారు. 'బిడ్డను కాపాడేందుకే తల్లిని చంపారు' అన్న ప్రధాని వ్యాఖ్యలను కూడా వారు ప్రస్తావించారు. 2018, 2022, 2023 సంవత్సరాల్లో తెలంగాణ ఏర్పాటుపై మోడీ చేసిన ప్రసంగాలలోని పలు వ్యాఖ్యలను ప్రస్తావించారు. సెప్టెంబర్ 18న ఆయన చేసిన వ్యాఖ్యల నుంచి 'తెలంగాణ కుష్ నహీ థా' అనే కామెంట్ ను ప్రస్తవించారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో వివిధ సందర్భాల్లో ప్రధాని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఇప్పటికే బీఆర్ఎస్ ఖండించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు చారిత్రక వాస్తవాలను పూర్తిగా విస్మరించడాన్ని ప్రతిబింబిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు.
undefined
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకోలేదని చెప్పడం సరికాదనీ, అజ్ఞానులుగా, అహంకారపూరితంగా కనిపిస్తారని, కాంగ్రెస్ ను విమర్శించే ప్రయత్నాల్లో మోడీ పదేపదే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని కేటీఆర్ అన్నారు. కాగా, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి, బహిరంగ సభలో ప్రసంగించడానికి ప్రధాని ఆదివారం మహబూబ్ నగర్ లో పర్యటిస్తున్నారు. ఈ సభ నుంచే తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుందనీ, ప్రధాని ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని అందిస్తారని ఒక బీజేపీ నాయకుడు పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో దేశంలో జరిగిన అభివృద్ధిపై కూడా ప్రధాని ప్రసంగం సాగే అవకాశం ఉంది.
ఈ ర్యాలీతో పాటు దాదాపు రూ.13,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రి మధ్యాహ్నం 2.15 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లాకు చేరుకుంటారు. రోడ్డు, రైలు, పెట్రోలియం-సహజ వాయువు, ఉన్నత విద్య వంటి ముఖ్యమైన రంగాలలో రూ. 13,545 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీని తర్వాత అక్టోబరు 3న నిజామాబాద్‌లో మోడీ బహిరంగ సభతో పాటు పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. నవంబర్-డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం సిద్ధమవుతున్నందున ప్రధాని పర్యటనలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.