తెలంగాణ యువకుడి ప్రతిభకు మెచ్చి... భుజం తట్టి గుండెలకు హత్తుకున్న ప్రధాని మోదీ

Published : Jul 09, 2023, 07:55 AM ISTUpdated : Jul 09, 2023, 08:01 AM IST
తెలంగాణ యువకుడి ప్రతిభకు మెచ్చి... భుజం తట్టి గుండెలకు హత్తుకున్న ప్రధాని మోదీ

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు చెందిన ఓ యువకుడి ప్రతిభను మెచ్చి ప్రత్యేకంగా అభినందించాడు. 

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీని కలవడమే అదృష్టంగా భావిస్తుంటారు. బండి  సంజయ్ లాంటి నాయకుడు సైతం ప్రధాని మోదీ నోట తన పేరు రావాలని, భుజం తట్టాలని కోరుకున్నట్లు పేర్కొన్నాడు. అలాంటిది ఆటిజంతో బాధపడుతున్న ఓ యువకుడి ప్రతిభకు మెచ్చిన ప్రధాని గుండెలకు హత్తుకుని మరీ అభినందించారు. యువకుడి మనోధైర్యమే ఆటిజాన్ని జయింతి అద్భుత ప్రతిభను బయటకు తీసిందన్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసింది. వరంగల్ పట్టణంలో వివిధ అభివృద్ది పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేసి తెలంగాణ బిజెపి నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇలా వరంగల్ కు విచ్చేసిన ప్రధానిని ఆటిజంతో బాధపడుతున్న కామిశెట్టి వెంకట్ అనే యువకుడు కలిసాడు. తల్లిదండ్రులతో కలిసి మోదీని కలవడానికి వచ్చిన వెంకట్ ను తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రధాని వద్దకు తీసుకెళ్లారు. 

ప్రధాని మోదీ ముందు వెంకట్ తన ప్రతిభను ప్రదర్శించాడు వెంకట్. ట్రిపుల్ ఆర్ మూవీలోని ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న 'నాటు నాటు' పాటను పాడుతూ డ్యాన్స్ కూడా చేసాడు వెంకట్. ఆటిజంతో బాధపడుతూ జీవితంపై నిరాశ చెందకుండా వెంకట్ చూపిస్తున్న మనోధైర్యం చూసి ప్రధాని ముచ్చటపడ్డాడు. అతడిని ఆలింగనం చేసుకుని ప్రధాని అభినందించారు. 

Read More  ప్రపంచమే మోదీని బాస్‌గా గుర్తించింది.. కేసీఆర్ ఇక్కడికి ఎందుకు రాలేదు?: బండి సంజయ్

కామిశెట్టి వెంకట్ ప్రతిభ అసాధారణమైనది... అతడు యువశక్తికి ఒక పవర్‌హౌస్ లాంటివాడంటూ ప్రధాని మోదీ ట్వీట్ కూడా చేసారు. ఆటిజం అతడిలోని టాలెంట్ ను అడ్డుకోలేకపోయిందని... అద్భుతంగా పాడుతూ అలరించాడని పేర్కొన్నారు. వెంకట్ 'నాటు నాటు' పాట పాడడంతో పాటు నృత్యం కూడా చేసాడన్నారు. అతడి మనోధైర్యాన్ని అభినందిస్తున్నానను అంటూ ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికన స్పందించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్