12న రామగుండానికి ప్రధాని నరేంద్ర మోడీ.. ఆర్‌ఎఫ్ సీఎల్‌ జాతికి అంకితం..

Published : Nov 04, 2022, 10:08 AM IST
12న రామగుండానికి ప్రధాని నరేంద్ర మోడీ.. ఆర్‌ఎఫ్ సీఎల్‌ జాతికి అంకితం..

సారాంశం

ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు రానున్నారు. ఈ నెల 12న పెద్దపల్లిజిల్లా రామగుండంలో పర్యటిస్తారు. 

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 12న పెద్దపల్లి జిల్లా రామగుండంలో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన దక్షిణాదిలోనే అతిపెద్ద ఎరువుల కర్మాగారమైన రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్ సీఎల్‌)ను ఆయన ఎన్‌టీపీసీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో జాతికి అంకితం చేస్తారు. ఇక్కడే సత్తుపల్లి-కొత్తగూడెం రైల్వే లైన్‌ను అధికారికంగా ప్రారంభిస్తారు. తెలంగాణకు మంజూరైన మూడు నేషనల్‌ హైవే ప్రాజెక్టులకు కూడా మోదీ రామగుండంలోనే శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. 

కాగా, బొగ్గు రవాణాకు సంబంధించి సత్తుపల్లి-కొత్తగూడెం రైల్వే లైన్‌ నిర్మించారు. సింగరేణి, రైల్వే సంయుక్త భాగస్వామ్యంతో రూ. 927.94 కోట్ల వ్యయంతో 54 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను నిర్మించారు. ఇందులో సింగరేణిల రూ.618 కోట్లు వెచ్చించగా, రైల్వే రూ.109 కోట్లు వెచ్చించింది. ఈ ప్రాజెక్టు పూర్తయి వినియోగంలోకి కూడా వచ్చింది. దీనిని ఇక్కడి నుంచే ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తరుణంలో రైల్వే సీనియర్‌ డీఆర్‌ఎం  రామగుండంలో సమీక్షించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్షించేందుకు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగనుంది.

కెనడాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు.. నిరోధించాలని కెనడాను కోరిన మోడీ..

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu