మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం:11 మంది మృతి

Published : Nov 04, 2022, 09:38 AM ISTUpdated : Nov 04, 2022, 10:02 AM IST
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం:11 మంది మృతి

సారాంశం

మధ్యప్రదేశ్  రాష్ట్రంలోని బేతుల్ సమీపంలో శుక్రవారంనాడు తెల్లవారుజామున జరిగిన రోడ్డు  ప్రమాదంలో  11 మంది మృతి చెందారు.

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ లో  జరిగిన రోడ్డు ప్రమాదంలో 11మంది  మృతి చెందారు. బస్సు, కారు ఢీకొనడంతో 11మంది చనిపోయారు.గుడ్ గావ్ ,బైస్దేహీ మధ్య శుక్రవారంనాడు తెల్లవారుజామున ఈ   ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనస్థలానికి  చేరుకున్నఅధికారులు  సహాయక  చర్యలు చేపట్టారు.

మృతుల్లో ఇద్దరు  చిన్నారులు కూడ  ఉన్నారు. జిల్లాకేంద్రానికి 86  కి.మీ దూరంలో ఉన్నబైందేహీ రోడ్డులో ఈ ప్రమాదం జరిగిందని  బేతుల్  పోలీస్ కంట్రోల్ రూమ్  అసిస్టెంట్  సబ్  ఇన్స్  పెక్టర్ శివరాజ్ సింగ్ ఠాకూర్  మీడియాకు చెప్పారు.ఈ  ప్రమాదంలో  మరణించిన వారిలో ఆరుగురు పురుషులు,ముగ్గురు మహిళలు ,ఇద్దరు చిన్నారులున్నారు.మహరాష్ట్రలోని అమరావతి నుండి తమ స్వగ్రామానికి  కూలీలు తమ స్వగ్రామానికి  తిరిగి  వస్తున్న సమయంలో ఈ ప్రమాదం  జరిగిందని  పోలీసులు  చెప్పారు.ఎస్‌యూవీలో చిక్కుకున్న ఆరు మృతదేహలను గ్యాస్  కట్టర్లతో బయటకు తీశారు పోలీసులు. ఎస్‌యూవీ  కారు డ్రైవర్ నిద్ర మత్తులో  బస్సును  ఢీకొట్టినట్టుగా  పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా  పోలీసులు వివరించారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!