9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించిన ప్రధాని మోడీ.. కాచిగూడ యశ్వంత్‌పూర్ రైలుకు జెండా ఊపిన కిషన్ రెడ్డి

By Mahesh K  |  First Published Sep 24, 2023, 5:19 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో తెలంగాణలోని కాచిగూడ నుంచి కర్ణాటకలోని యశ్వంత్‌పూర్ వరకు ఒకటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి తమిళనాడులోని చెన్నై వరకు మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు అందించనుంది.
 


హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇందులో ఒకటి కాచిగూడ-యశ్వంత్‌పూర్, విజయవాడ-చెన్నై మధ్య సేవలు అందించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి. కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య సేవలు అందించే వందే భారత్ రైలును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.  కాగా, విజయవాడలో కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ జెండా ఊపి విజయవాడ-చెన్నై మధ్య సేవలు అందించే వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం మన దేశంలో 25 వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. వీటికి అదనంగా తొమ్మిది వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.

11 రాష్ట్రాల అవసరాలకు ఈ 9 కొత్త వందే భారత్ రైళ్లు సేవలు అందించనున్నాయి. ఈ రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఈ రైళ్లు వెళ్లనున్నాయి. రాజస్తాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సేవలు అందించనున్నాయి.

Latest Videos

Also Read: Isha: గ్రామీణ స్ఫూర్తిని రగిలించే సాధనంగా ఇషా గ్రామోత్సవం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఈ వందే భారత్ ట్రైన్లు ఎంతో సమయాన్ని ఆదా చేస్తాయని, ప్రయాణికులను వేగంగా గమ్యాలను చేరుస్తాయని వివరించారు. కాచిగూడలో వందే భారత్ రైలును జెండా ఊపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం, మాట్లాడుతూ.. మోడీ ప్రధానమంత్రి అయ్యాక రైల్వే శాఖలో నూతన అధ్యాయం మొదలైందని అన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని వివరించారు. వీటికి అదనంగా మరో వందే భారత్ రైలు కాచిగూడ నుంచి బెంగళూరులోని యశ్వంత్ పూర్‌కు, విజయవాడ నుంచి చెన్నైకి అందుబాటులోకి వచ్చాయి. కాచిగూడ, యశ్వంత్ పూర్‌ల నడుమ నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మహబూబ్ నగర్, కర్నూల్, అనంతపురం, ధర్మవరం రైల్వే స్టేషన్‌లలో స్థానికంగా ఆగుతాయి.

click me!