మంత్రి పొన్నం ప్రభాకర్ హనుమకొండ ఆర్డీవో పై సీఎస్ శాంతి కుమారికి ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫోన్ కాల్ లీక్ వివాదంలో మంత్రి ఈ ఫిర్యాదు చేశారు.
తన ఫోన్ కాల్ ను హనుమకొండ ఆర్డీవో రికార్డు చేసి, దానిని ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు లీక్ చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఈ విషయంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారికి ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో చేసిన చిట్ చాట్ లో ఈ విషయాన్ని వెల్లడించారు.
రైతులను ఆదుకుంటాం.. పంట నష్టం అంచనాకు ఆదేశించాం - మంత్రి తుమ్మల
ఈ నెల 15వ తేదీన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ కాల్ మంత్రి కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ విషయంలో హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ తహసీల్దార్ మాధవితో మాట్లాడారు. ఆ సమయంలో అదే కాల్ లో హనుమకొండ ఆర్డీవో రమేష్ కుమార్ కూడా ఉన్నారు. వీరి మధ్య జరిగిన సంభాషణ తరువాత బయటకు వచ్చింది. దీంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవో పై ఫిర్యాదు చేశానని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
ఆశ్చర్యం.. మెదడులో రక్తం కారుతున్నా.. శివరాత్రికి సద్గురు అంత ఉత్సాహంగా ఎలా ఉన్నారు ?
మీడియాతో చిట్ చాట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు విషయాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం వల్లే కరువు వచ్చిందంటూ ప్రతిపక్ష నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించరారు. వాస్తవానికి పోయిన సంవత్సరం సెప్టెంబర్ లో వర్షాలు సరిగా పడలేదని అన్నారు. కావాలంటే 2022-23 సంవత్సరంలోని వాతావరణ రిపోర్ట్ ను ప్రజలు ముందు ఉంచుతామని తెలిపారు.
భారత ప్రజాస్వామ్యానికి లోక్ సభ ఎన్నికలు కీలకం.. - సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ సిటీలోని ప్రజల అవసరాలకు గోదావరి, సింగూరు, ఉస్మాన్‌సాగర్, కృష్ణా నదుల నుంచి నీటిని అందిస్తున్నామని మంత్రి చెప్పారు. బూస్టర్ పైపుల ద్వారా అవసరమైతే నాగర్జున సాగ్ నుంచి నీటిని తీసుకొస్తామని తెలిపారు. కరవు పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు కూడా సహకరించాలని పొన్నం ప్రభాకర్ కోరారు. అనంతరం లోక్ సభ ఎన్నికలపై ఆయన మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ ప్రధానంగా ఉంటుందని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ బలహీనపడిపోయిందని చెప్పారు.