నిర్మల్ జిల్లాలో రైతులపై లాఠీచార్జిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్ర‌హం

By Mahesh Rajamoni  |  First Published Aug 20, 2023, 2:58 AM IST

Nirmal District: అక్రమాలను ప్రశ్నించినందుకు దాడి చేస్తారా? అంటూ ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖర్ రావు (కేసీఆర్) పై కేంద్రమంత్రి జీ.కిషన్‌రెడ్డి మండిప‌డ్డారు. నిర్మల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను వెనక్కి తీసుకోవడంలో విఫలమైతే సీఎం కేసీఆర్‌ నిద్రలేని రాత్రులు గడపాల్సిందేనంటూ వ్యాఖ్యలు చేశారు. రైతుల‌పై జ‌రిగిన లాఠీచార్జికి నిర‌స‌న‌గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాష్ట్ర బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. 
 


Union Minister Kishan Reddy: అక్రమాలను ప్రశ్నించినందుకు దాడి చేస్తారా? అంటూ ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖర్ రావు (కేసీఆర్) పై కేంద్రమంత్రి జీ.కిషన్‌రెడ్డి మండిప‌డ్డారు. నిర్మల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను వెనక్కి తీసుకోవడంలో విఫలమైతే సీఎం కేసీఆర్‌ నిద్రలేని రాత్రులు గడపాల్సిందేనంటూ వ్యాఖ్యలు చేశారు. రైతుల‌పై జ‌రిగిన లాఠీచార్జికి నిర‌స‌న‌గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాష్ట్ర బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది.

వివ‌రాల్లోకెళ్తే.. నిర్మల్ జిల్లాలో ఆందోళన చేస్తున్న రైతులు, బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జీ.కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజల సమస్యలపై స్పందించకపోతే భవిష్యత్తులో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ను హెచ్చరించారు. నిర్మల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను వెనక్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. 

Latest Videos

నిర్మల్ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్ బస్టాండ్ ప్రాంతంలో ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడానికి బదులుగా పోలీసులను ఉపయోగించి నిరసన తెలుపుతున్న బీజేపీ కార్య‌క‌ర్త‌లు, రైతుల‌పై లాఠీఛార్జ్ చేసిందని పేర్కొన్నారు.

ఈ ఘటనలో గాయపడిన పలువురు రైతులకు అవసరమైన వైద్యం అందించాలని జిల్లా నేతలను కిషన్ రెడ్డి కోరారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వాటిని విస్మరించి ప్రజల జీవితాలను, పౌర వ్యవస్థలను మరింత క్లిష్టతరం చేస్తోందని మండిప‌డ్డారు. నిర్మల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే సీఎం కేసీఆర్‌ నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని హెచ్చరించారు.

అంత‌కుమందు కిష‌న్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ అవినీతిలో గత కాంగ్రెస్ పాలనను మించిపోయిందని ఆరోపించారు. 'బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు తేడా లేదు. మజ్లిస్ పార్టీ చేతిలో స్టీరింగ్ ఉన్న ఒకరికొకరు ఓటు వేసినట్లే. తెలంగాణలో మూడు ముక్క‌లాట రాజకీయ క్రీడ నడుస్తోంది’’ అని కిష‌న్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ను మళ్లీ ఎన్నుకోవడం వల్ల ప్రతి వర్గం కష్టాలు పడుతున్న తెలంగాణ మరింత విధ్వంసానికి దారి తీస్తుందని హెచ్చ‌రించారు. 
 


 

click me!