టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్టు

Published : May 08, 2021, 09:29 AM ISTUpdated : May 08, 2021, 10:31 AM IST
టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్టు

సారాంశం

టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధును పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పోలీసులు భీమవరంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఏ కేసులో అరెస్టు చేశారనే విషయం తెలియడం లేదు.

కరీంనగర్: టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధును పోలీసులు అరెస్టు చేశారు. భీమవరంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆయనను ఏ కేసులో అరెస్టు చేశారనే విషయాన్ని పోలీసులు చెప్పడం లేదు.  ఆయనను హైదరాబాదు తీసుకుని వస్తున్నారు.

ఏప్రిల్ 30వ తేదీన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్టారు. చివరకు భీమవరంలో ఆయనను కనిపెట్టి అదుపులోకి తీసకున్నారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా పుట్ట మధు ఆచూకీని పోలీసులు గుర్తించారు. న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసులో గతంలో పోలీసులు పుట్ట మధును ప్రశ్నించారు. ఆయన రామగుండ టాస్క్ పోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు.

పుట్ట మధును పోలీసులు రామగుండం తీసుకుని వెళ్లారు. వామన్ రావు దంపతుల హత్య కేసులో ఆయనను విచారిస్తున్నారు. వామన్ రావు దంపతులను పెద్దపల్లి నడిరోడ్డుపై అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో పుట్ట మధుకు సంబంధం ఉందనే ప్రచారం గతంలో సాగింది.

Also Read: అజ్ఞాతంలోకి టీఆర్ఎస్ నేత పుట్ట మధు: భార్య శైలజ వివరణ ఇదీ.

ఇదిలావుంటే, పుట్ట మధు కనిపించుకుండా పోయారనే వార్తలపై ఆయన భార్య, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ వివరణ ఇచ్చారు. పుట్ట మధు ఎక్కడికీ వెళ్లలేదని ఆమె స్పష్టం చేశారు. తన భర్త పుట్ట మధుకు స్వల్వంగా కోవిడ్ లక్షణాలు ఉన్నాయని, అందుకే ఫోన్ స్విఛాఫ్ చేశారని ఆమె చెప్పారు. 

పుట్ట మధుపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, ప్రజాప్రతినిధులు వ్యక్తిగత జీవితం కూడా ఉంటుందని ఆమె అన్నారు. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ లో ఉండేవారని, అందుకే ఆయనను అప్పట్లో కలిశామని ఆమె చెప్పారు తాము టీఆర్ఎస్ లోని ఉంటామని శైలజ చెప్పారు. 

Also Read: టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అదృశ్యం

తమను ఈ స్థాయికి తీసుకుని వచ్చింది ముఖ్యమంత్రి కేసీఆరే అని ఆమె చెప్పారు. పుట్ట మధుపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?
KTR Speech: కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తాం.. ఎదురు దెబ్బలు పట్టించుకోము | Asianet News Telugu