పల్లీలు తింటుంటే ఓ పలుకు గొంతులోంచి జారి, ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయింది. దీంతో తీవ్ర అనారోగ్యంతో ప్రాణాలమీదికి వచ్చింది ఓ మహిళకు...
హైదరాబాద్ : వేయించిన పల్లీలు తినడం మీకు అలవాటా? ఆరోగ్యానికి మంచిదని అప్పుడప్పుడు నమిలేస్తున్నారా? అయితే ఓ చిన్న వేరుసెనగ పలుకు ఓ మహిళ ప్రాణం మీదికి తెచ్చిందన్న సంగతి తెలుసా? చిన్న పిల్లలకైతే గొంతులో ఇరుక్కుంటుందని భయపడొచ్చు…మహిళకు ఏం జరిగింది? అని ఆశ్చర్యపోతున్నారా… ఈ స్టోరీ చదివితే.. ఇలా కూడా అవుతుందా అని ఆశ్చర్యపోతారు…
హైదరాబాదులోని కొండాపూర్ కు చెందిన విజయలక్ష్మి అనే మహిళ రోజు గుప్పెడు పల్లీలు తింటుంది. ఆ రోజు కూడా అలాగే తిన్నది. అయితే ఆ తినడం కూర్చుని తింటే సమస్య అవ్వకపోయేదేమో... ఆమె పడుకుని, ఒక పక్కకు తిరిగి తింటుంది. అలా తింటున్న సమయంలో ఒక వేరుశనగ పలుకు గొంతులో నుంచి జారి.. ఊపిరితిత్తుల్లోకి వెళ్లి, ఇరుక్కుపోయింది.
undefined
నిమజ్జనానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు.. రూట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
అది ఆమె గమనించిందో.. లేదో.. కానీ, ఆ తరువాత ఆమెకి.. ఒకటి రెండు రోజుల్లోనే దగ్గు, జ్వరం, ఆయాసం లాంటివి ఇబ్బంది పెట్టాయి. డాక్టర్ దగ్గరికి వెళితే న్యూమోనియా అనుకుని చికిత్స ప్రారంభించారు. మందులు వేసుకుంటున్నా కూడా ఈ లక్షణాలు తగ్గకపోగా, రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని విజయలక్ష్మి నానక్ రాం గూడాలో ఉన్న స్టార్ ఆసుపత్రిలోని ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కిషన్ ను సంప్రదించారు.
ఆమె లక్షణాలు, చెబుతున్న విధానంతో అనుమానం వచ్చిన డాక్టర్ ఎందుకైనా మంచిదని వెంటనే సిటీ స్కాన్ చేయించారు. దీంతో ఊపిరితిత్తులకు, శ్వాస నాళాలకు మధ్య ఏదో ఇరుక్కుని పోయిందని తేలింది. దీనివల్లే నిమోనియాకు దారి తీసినట్టుగా తేల్చారు. ఆ ఇరుక్కుపోయిన దాన్ని తీయడం కోసం బ్రాంకోస్కోపీ చేశారు. ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయిన దాన్ని బయటికి తీసి చూడగా.. అది వేరుశెనగ పలుకు. దీంతో డాక్టర్లు అవాక్కయ్యారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉంది.