రంగారెడ్డి జిల్లాలో ఇద్దరి మీద పీడీయాక్ట్.. వ్యభిచారగృహం నిర్వహిస్తూ పట్టుబడడంతో...

By SumaBala BukkaFirst Published Dec 1, 2022, 2:16 PM IST
Highlights

వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఇద్దరి మీద పీడీయాక్ట్ నమోదయ్యింది. రంగారెడ్డి జిల్లా మీర్పేటలో వీరిద్దరూ వేరే ప్రాంతాలనుంచి అమ్మాయిలను తరలించి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. 

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో ఇద్దరిపై పిడి యాక్ట్ నమోదయింది.  రంగారెడ్డి జిల్లా మీర్పేట్ లోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వీరు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈమేరకు సమాచారం అందడంతో రాచకొండ పోలీసులు దాడి చేశారు. వీరిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ వీరి మీద పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మీర్ పేట పోలీసులు వీరి మీద  పీడీయాక్ట్ నమోదు చేశారు. నిందితుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  విశాఖపట్నం జిల్లా ఎల్లంపేటకు చెందిన గంధ భవానీ (25), గోదావరి జిల్లా అన్నవరానికి చెందిన  కసిరెడ్డి దొరబాబులు (23)గా  గుర్తించారు. వీరిద్దరూ స్నేహితులు. వీరిద్దరూ కలిసి మీర్పేట టీకేఆర్ కాలేజీ దగ్గర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఆ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

ఈజీగా, ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలని, విలాసవంతమైన జీవితం గడపాలని వీరి కోరిక. దీని కోసం ఇతర ప్రాంతాల నుంచి కూడా మహిళలను రప్పించి, అక్రమ రవాణా చేసి  ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈమేరకు  మీర్పేట్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్టోబర్ 13వ తారీఖున ఆ ఇంటిపై దాడి చేశారు. వ్యభిచార గృహ నిర్వాహకులను కసిరెడ్డి దొరబాబు, గంధ భవానిలను అరెస్టు చేశారు. వీరి చెరలో ఉన్న ఇద్దరు మహిళలను విడిపించారు. వీరు నగరానికి చెందినవారిగా గుర్తించారు. మీరు మళ్లీ భవిష్యత్తులో ఇలాంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండాలని సీపీ ఆదేశాల మేరకు  వీరిద్దరి మీద  బుధవారం పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఆ తర్వాత అక్కడినుంచి జైలుకు తరలించారు. 

click me!