రాస్కో సాంబా..?

Published : Nov 26, 2016, 01:14 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
రాస్కో సాంబా..?

సారాంశం

ఎంపీలంతా క్యూలో నిలబడాలన్న పవన్ కల్యాణ్ ప్రజలకు మద్దతి ఇవ్వాలని సూచన

నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఏటిఎంల ముందు క్యూలో నిలబడి గగ్గోలు పెడుతున్నారు.

 

ఇప్పటి వరకు జనం బాధలపై స్పందించిన ఒక్క తెలుగు ఎంపీ కూడా లేరంటే అతిశయోక్తి లేదు.  దీనిపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందించారు.

 

ఎంపీలందరూ ప్రజల కష్టాలకు సంఘీభావం తెలపడానికి బ్యాంకుల దగ్గర క్యూ లో నిలబడితే బాగుంటుందని సూచించారు.  ఈ మేరకు ట్విట్టర్ లో తన అభిప్రాయాలను పోస్టు చేశారు. ఆంధ్రా బీజేపీ ఎంపీలు, తెలంగాణ ఎంపీలు ఏటీఎంలు, బ్యాంకుల దగ్గర నిలబడి తమ వంతు మద్దతు ప్రకటిస్తే ప్రజలకి కాస్త దైర్యంగా ఉంటుందన్నారు.

 

కర్నూలు జిల్లా నంది కొట్కూరులోని బ్యాంకులో తన డబ్బులు డ్రా చేయడం కుదరక కుప్పకూలి మృతిచెందిన బాలరాజు కుటుంబానికి సానుభూతి తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

డియర్ పేరెంట్స్.. 'సామాన్లు' కామెంట్స్ కాదు సమస్య.. మీ పిల్లలకు అసలు సమస్య ఇదే..!
IMD Cold Wave Alert : తెలంగాణపై చలిపిడుగు... ఈ నాలుగు జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త