ఎంతైనా వర్మ బ్యాచ్ కదా?

Published : Nov 26, 2016, 11:57 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
ఎంతైనా వర్మ బ్యాచ్ కదా?

సారాంశం

మహిళల నైటీలపై ఉత్తేజ్ సంచలన వ్యాఖ్యలు

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ వర్మ.. అతడు ఏం చేసినా.. ఏం రాసినా సంచలనమే.. సినిమాలతో కంటే వివాదాలతోనే ఆయన ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాడు.

 

ఇప్పడు రచయిత, నటుడు ( ఇప్పడు పెద్దగా ఏం చేయడం లేదనుకుంటా) ఉత్తేజ్ కూడా వర్మ బాటలోనే నడవాలని నిశ్చయించుకున్నట్లు ఉన్నాడు.

 

ఉత్తేజ్... వర్మకు సంబంధించిన చాలా సినిమాలకు మాటలు రాశారు. అలాగే, కొన్ని సినిమాల్లో నటించారు కూడా.

 

ఇప్పుడు వర్మ కంటే తానేం తక్కువ తినలేదు అన్నట్లు ఆయన టైపులోనే మహిళపై కామెంట్లు చేస్తున్నాడు.

 

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తేజ్ మహిళలు నైటీలు ధరించడంపై నోరు పారేసుకున్నాడు. ‘కొంతమంది మహిళలు నైటీలను రాత్రితోనే ఆపరు. పగటి సమయంలో కూడా వాటితోనే తిరుగుతుంటారు. ఇంకొంతమందైతే నైటీలు వేసుకుని స్కూటీలు నడిపేస్తుంటారు. ఇది ఎంతవరకు సమంజసం’ అని ప్రశ్నించారు.

 

చూడాలి... ఈ ప్రశ్నకు మహిళా సంఘాలు ఏలాంటి సమాధానం చెబుతాయో..

 

PREV
click me!

Recommended Stories

డియర్ పేరెంట్స్.. 'సామాన్లు' కామెంట్స్ కాదు సమస్య.. మీ పిల్లలకు అసలు సమస్య ఇదే..!
IMD Cold Wave Alert : తెలంగాణపై చలిపిడుగు... ఈ నాలుగు జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త