తన సోదరుడు చిరంజీవి (Chiranjeevi gets Padma Vibhushan award) వచ్చిన ప్రతీ పాత్రను, సినిమాను ఎంతో మనసు పెట్టి చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (jana sena chief pawan kalyan) అన్నారు. అందుకే ఆయన ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేశారని తెలిపారు. పద్మ విభూషణ్ అవార్డు (padma Vibhushan) పొందటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
సినీ రంగంలో విశిష్ట సేవలు అందించిన చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. అయితే దీనిపై మెగాస్టార్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ అవార్డు రావడం పట్ల చిరంజీవి సోదరుడు, సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. అభినందనలు తెలిపారు.
వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్.. మొదటి స్పందన ఏంటంటే ?
undefined
భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయంకృషితో సాధించుకున్న అన్నయ్య చిరంజీవిని ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు. నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్నీ మనసుపెట్టి చేశారని కొనియాడారు. కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారని ప్రశంసలు కురిపించారు.
చిరంజీవి అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా తన సోదరుడికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
150 Years Imprisonment: మైనర్ కుమార్తెపై పలుమార్లు అత్యాచారం.. కీచక తండ్రికి 150 ఏళ్ల జైలు శిక్ష..
అలాగే పద్మ విభూషణ్ అవార్డు లభించిన మరో తెలుగు నాయకుడు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కూడా పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. వెంకయ్య నాయుడు పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం ముదావహం అని పేర్కొన్నారు. విద్యార్థి నాయకుడి దశ నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ఆయన.. సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్నారని చెప్పారు. ఆయన వాగ్ధాటి, తెలుగు భాషపై ఉన్న పట్టు అసామాన్యమైనవని కొనియాడారు.
వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా కూడా విశేషమైన సేవలందించారని తెలిపారు. రాజకీయ ప్రస్థానంతోపాటు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. వెంకయ్య నాయుడికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నానని పేర్కొన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ నుంచి కళా, సాహిత్య రంగాల నుంచి పలువురు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక కావడం సంతోషకరం అని పేర్కొన్నారు.
మచిలీపట్నానికి చెందిన హరికథ కళాకారిణి శ్రీమతి ఉమా మహేశ్వరి, తెలంగాణ రాష్ట్రం నుంచి చిందు యక్ష గాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, స్థపతి వేలు ఆనందాచారి, బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, సాహిత్య విభాగం నుంచి శ్రీ కేతావత్ సోంలాల్, కూరెళ్ళ విఠలాచార్యలు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక కావడం ఆనందదాయకంగా ఉందని వారికి తన అభినందనలు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.