ధర్నాచౌక్ ఉద్యమానికి పవన్ మద్దతు

First Published May 11, 2017, 10:41 AM IST
Highlights

సమస్యలు ఎదురయినపుడు తమ అభిప్రాయాలను శాంతియుతంగా  వ్యక్తం చేయడం, నిరసన తెలపడం ప్రజాస్వామ్యంలో ఉండే స్వేచ్ఛ. ఢిల్లీలో జంతర్ మంతర్ లాగా అనేక చోట్ల  దీని కొక ప్రదేశం ఉంటుంది. ఇలాంటి ప్రదేశాన్ని తొలగించి వేరేచోటికి తరలించారు. దీనిమీద ప్రజాసంఘాలు, రాజకీయా పార్టీలు, గద్దర్ లాంటి వారు ఉద్యమం చేస్తున్నారు. దీనికి నా పూర్తి మద్ధతు ఉంటుంది.

తెలంగాణాలో ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు చేస్తున్న ధర్నా చౌక్ పరిరక్షణ ఉద్యమానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారు.

 

 ఈ రోజు ఈ విషయం మీద సిపిఎం నాయకులతో చర్చలు జరిపిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు. తొందర్లో ప్రజాసంఘాలు నిర్వ హించబోతున్న ధర్నాకు తన సంపూర్ణ మద్ధతు ఉంటుందని ఆయన చెప్పారు.

 

’ఏవయిన సమస్యలు ఎదురయినపుడు తమ అభిప్రాయాలను శాంతియుతంగా వ్యక్తం చేయడం నిరసన తెలపడం ప్రజాస్వామ్యంలో ఉండే స్వేచ్ఛ. ఢిల్లీలో జంతర్ మంతర్ లాగా అనేక చోట్ల  దీనికొక ప్రదేశం ఉంటుంది. ఇలాంటి ప్రదేశాన్ని తొలగించి వేరేచోటికి తరలించారు. దీనిమీద ప్రజసంఘాలు, రాజకీయా పార్టీలు, గద్దర్ లాంటి వారు ఉద్యమం చేస్తున్నారు. దీనికి నాపూర్తి మద్ధతు ఉంటుంది.‘ అని ప్రకటించారు.

 

సిపిఎం నాయకులు ఈ రోజు తనను కలసి ధర్నా చౌక్ ఉద్యమానికి మద్దతునీయాలని, ఉద్యమంలో పాల్గొనాలని  కోరారని పవన్ చెప్పారు.

 

click me!