(వీడియో) రైతే రాజు అంటివి.. ఇప్పుడు బేడీలేసి సత్కరిస్తివి

Published : May 11, 2017, 03:55 AM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
(వీడియో) రైతే రాజు అంటివి.. ఇప్పుడు బేడీలేసి సత్కరిస్తివి

సారాంశం

బంగారు తెలంగాణకు రైతే వెన్నెముక అని నాడు గళమెత్తిన నేత ఇప్పుడు ఎందుకిలా మారిపోయారు…? గిట్టుబాటు ధర అడిగిన రైతన్నల గళాలను ఎందుకు నొక్కుతున్నారు…?

తాను కూడా రైతే అని చెప్పుకొనే తెలంగాణ ముఖ్యమంత్రి అన్నదాతల పట్ల ఎందుకు ఇంత కఠినంగా వ్యహరిస్తున్నారు... ?

 

బంగారు తెలంగాణకు రైతే వెన్నెముక అని నాడు గళమెత్తిన నేత ఇప్పుడు ఎందుకిలా మారిపోయారు…?

 

గిట్టుబాటు ధర అడిగిన రైతన్నల గళాలను ఎందుకు నొక్కుతున్నారు…?

 
నిన్నగాక మొన్న జరిగిన పార్టీ వార్షికోత్సవ సభలో రైతును రాజును చేస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అదే రైతుకు ఆయన పోలీసులే బేడీలేసి హంతకుల్లా చూస్తుంటే ఏం చేస్తున్నారు..?

 

ఎన్నికల వేళ లక్ష రుణ మాఫీతో రైతు ఓట్లు దండుకున్న గులాబీ నేత ఇప్పుడు ఈ ఘటనకు ఏం సమాధానం చెబుతారు.

 

ఇటీవల ఖమ్మంలో మిర్చి పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో అక్కడి రైతులు  రగిలిపోయి రోడ్డెక్కిని విషయం తెలిసిందే.

అయితే ఇదేదో జాతి వ్యతిరేక ఘటనలా భావించిన ప్రభుత్వం అన్నదాతలను పోలీసులతో  చితగొట్టించింది. ఆ ఘటనలో పాల్గొన్న వారిపై రాజద్రోహం తరహా కేసులు పెట్టి జైళ్లో పెట్టింది.

ఇప్పుడు అది చాలదన్నట్లు ఆ రైతుల పట్ల ఖమ్మం పోలీసుల అమానుషంగా ప్రవర్తించారు.వారికి బేడీలు వేసి కోర్టుకు తీసుకు వచ్చారు.  పదిమంది రైతులను ఇలానే బేడీ వేసి కోర్టు ముందు హాజరుపరిచారు.

 

ఈ ఘటనపై ఇప్పుడు సర్వత్రా మిమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రైతులకు ఏ నేరం కింద బేడీలు వేశారని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ చర్యను టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు

 

గిట్టుబట ధర అడిగిన రైతులపై రాజద్రోహం కేసులను పెట్టడమేంటని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి వెన్నెముక అయిన రైతులకు బేడీలు వేయడంపై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అప్పటి ప్రభుత్వాలు ఇంతటి దారుణానికి పాల్పడలేదని విమర్శించారు.

 

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా