ధర్నాచౌక్ ఉద్యమం : పాల్గొంటే పవన్ కు చిక్కు లొస్తాయా?

First Published May 11, 2017, 9:48 AM IST
Highlights

ధర్నాచౌక్ పరిరక్షణ కోసం  జరుగుతున్న ఉద్యమానికి పవన్ సానుకూలంగా స్పందించారని సిపిఎం నాయకులు  చెప్పారు. దాదాపు అరగంటపాటు పవన్‌తో సిపిఎం నేతలు చర్చలు జరిపారు. రాబోయే రోజుల్లో తాము జనసేనతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తమ్మినేని పేర్కొన్నారు. మరి పవన్ ఏమన్నారో తెలియదు. ఒకటిరెండు రోజులలో ధర్నాచౌక్ రద్దుగురించి  పవన్  ట్విట్టర్ లో స్పందిస్తారని అనుకుంటున్నారు.

హైదరాబాద్ లో ధర్నాచౌక్ మూసివేతకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని సిపిఎం  జనసేన నాయకుడు పవన్  కల్యాణ్ ను కోరింది.

 

సిపిఎం నేతలు తమ్మినేని వీరభద్రం, చెరుకుపల్లి సీతారాములు గురువారం నాడు  జనసేన అధి పతి పవన్ కల్యాణ్‌ను కలసి ఈ మేరకు చర్చలు జరిపారు.

 

హైదరాబాద్ లో ఇందిరా పార్క్ సమీపంలో ఉన్న ధర్నా చౌక్ ను తెలంగాణా ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. శాంతిభద్రతలకు భంగం కల్గిస్తున్నదని ధర్నచౌక్ ను ఉరిబయటకు తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయించకుంది. అయితే, ఈ నిర్ణయాన్ని తెలంగాణా జెఎసి నాయకుడు ప్రొఫెసర్ కోదండ రామ్ తో సహా రాజకీయ పార్టీ లన్నీ వ్యతిరేకిస్తున్నారు. మెల్లిమెల్లిగా ధర్నా చౌక్ పరిరక్షణ ఉద్యమ స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో  సిపిఎం నాయకుడు పవన్ ను కలిశారు.

 

ఈ సమావేశంలో తెలంగాణా రాజకీయ పరిస్థితి కూడా చర్చకు వచ్చిందని చెబుతున్నారు.

 

ధర్నాచౌక్ పరిరక్షణ కోసం చేయబోయే ఉద్యమానికి పవన్ సానుకూలంగా స్పందించారని సిపిఎం నాయకులు  చెప్పారు. దాదాపు అరగంటపాటు పవన్‌తో సిపిఎం నేతలు చర్చలు జరిపారు. రాబోయే రోజుల్లో తాము జనసేనతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తమ్మినేని పేర్కొన్నారు.

 

అయితే, ఈ మధ్య పవన్  రాష్ట్ర ఐటి మంత్రి కెటిఆర్ బాగాసన్నిహితమయ్యారు. ఇద్దరు కలసి భోజనం చేస్తూ రాజకీయాలు మాట్లాడుకున్నారు. తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన  నూలు వస్త్రాలనుప్రోత్సహక కార్యక్రమానికి  పవన్ మద్ధతు తెలిపారు.  ఈ స్నేహం చిగురిస్తున్నపుడు పవన్ టిఆర్ ఎస్  ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నా చౌక్ ఉద్యమంలో పాల్గొని గిల్లికజ్జా లు పెట్టుకుంటారా?

టిఆర్ ఎస్ పంచ్ లు చాలా బలంగా ఉంటాయి. వాటికి పవన్ సిద్ధమవుతారు.

ఒకటిరెండు రోజులలో పవన్ ట్విట్టర్ లో  ధర్నాచౌక్ రద్దుగురించి   ట్విట్టర్ లో స్పందిస్తారని అనుకుంటున్నారు.

 

click me!