హిందువులకు మాత్రమే ఆధార్ కార్డులివ్వాలి... ప్రత్యేక చట్టం తేవాలి... పరిపూర్ణానంద స్వామి పిలుపు

Published : Apr 04, 2023, 06:47 AM ISTUpdated : Apr 04, 2023, 06:52 AM IST
హిందువులకు మాత్రమే ఆధార్ కార్డులివ్వాలి... ప్రత్యేక చట్టం తేవాలి... పరిపూర్ణానంద స్వామి పిలుపు

సారాంశం

హిందువులు, హిందుధర్మం గౌరవించే వారికి మాత్రమే ఆధార్ కార్డులివ్వాలని.. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలంటూ పరిపూర్ణానంద స్వామి పిలుపునిచ్చారు. 

జగిత్యాల : పరిపూర్ణానంద స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆధార్ కార్డులు దేశంలోని హిందువులకు.. హిందూ ధర్మాన్ని గౌరవించే వారికి మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల పట్టణంలో వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా  యాత్రలో పాల్గొన్న పరిపూర్ణానంద స్వామి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ‘హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చట్టం తేవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన దేశంలో హిందువుల జీవించే వారికి ఆధార్ కార్డులు ఇవ్వాలి. హిందువులు కాకుండా,  హిందువులను గౌరవించే వారికి మాత్రమే ఆధార్ కార్డులు ఇవ్వాలి’ అన్నారు.

ఈ చట్టం తేవడం కోసం.. ఇది అమలవడం కోసం  పార్లమెంటు స్థాయిలో..  ఇతర అన్ని స్థాయిల్లోనూ ఆ దిశగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలి…అన్నారు. అంతే కాదు, జగిత్యాలకు చెబితే జగమంతా చెప్పినట్లే అని చెప్పుకొచ్చారు. అందుకే ఈ  హిందువులకు ఆధార్ కార్డు  అనే అంశానికి  ఇక్కడినుంచే  దేశవ్యాప్తం కావాలి’  అని పిలుపునిచ్చారు. హనుమాన్ విజయ యాత్రలో పరిపూర్ణానంద స్వామితో పాటు నిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ వెంకట్రాజ్ రెడ్డి,  వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు బోయిని పద్మాకర్  తదితరులు పాల్గొన్నారు. 

కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ పరీక్షల్లో సాంకేతిక సమస్యలు: నాచారంలో అభ్యర్ధుల ఆందోళన

‘హిందువులను గౌరవించకుంటే వారి ఆధార్ కార్డ్ కట్ చేయాలి. ఆధార్ కార్డు లేదంటే.. వారికి ఆధార్ లేదు బాదార్ లేదు..చలో చలో చలో.. ఆఫ్ఘనిస్తాన్ చలో, పాకిస్తాన్ బాగో.. డాకా కు వెళ్లు, బంగ్లాదేశ్ పో.. లేదా  బాయిలో దూకు.. కానీ ఆధార్ లేదు. ఈ దేశంలో స్థానం లేదు. హిందువులకు గౌరవం ఇవ్వకపోతే మీ ఆధార్ కట్ చేస్తాం అని చెప్పాలి...’ అంటూ వివాదాస్పదం మాట్లాడారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?