హైదరాబాద్‌లో భర్తను హతమార్చిన భార్య.. జీవిత ఖైదు విధించిన కోర్టు

By Mahesh K  |  First Published Apr 3, 2023, 8:10 PM IST

భర్తను చంపేసిన భార్యకు ఈ రోజు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన బండారి శ్రీనును భార్య బసవరేఖ 2020లో హతమార్చింది. ఈ కేసు విచారణ చేసిన  డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది.
 


హైదరాబాద్: భర్తను హతమార్చిన కేసులో భార్యకు జీవిత ఖైదు శిక్ష పడింది. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. దీంతో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సంతపల్లి గ్రామానికి చెందిన బసవరేఖకు ఈ శిక్ష పడింది. ఈ మేరకు రాచకొండ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం, బండారి శ్రీను మేనమామ బిడ్డ బసవరేఖను పెళ్లి చేసుకున్నాడు. వారికి కూతురు, కొడుకు సంతానం. అయితే, భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నదని శ్రీను తరుచూ అనుమానించేవాడు. మద్యపానానికీ బానిసయ్యాడు. ఈ విషయమై వారి మధ్య గొడవలు జరిగేవి. బసవరేఖను మానసికంగా, శారీరకంగా హింసించేవాడు.

Latest Videos

undefined

అలాగే 2020 ఫిబ్రవరి 23న వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో శ్రీను ఓ పోల్ పై పడిపోయాడు. తలకు తీవ్ర గాయమైంది. ఈ విషయాన్ని బసవరేఖ ఆమె తల్లిదండ్రులకు తెలిపింది. వారు శ్రీను, బసవరేఖ, వారి పిల్లలను తమ వెంట తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత రాత్రి నిద్రలేచిన శ్రీను పిల్లలను తీసుకుని తమ ఇంటికి బయల్దేరే ప్రయత్నం చేశాడు. పిల్లలను తీసుకెళ్లకుండా బసవరేఖ అడ్డుకుంది. ఈ క్రమంలోనే గొడవ ముదిరింది. శ్రీనును నెట్టేయడంతో గోడకు గుద్దుకుని కిందపడిపోయాడు. అప్పుడు బసవరేఖ దిండును తీసుకువచ్చి ముఖం పై ఉంచి ఊపిరాడకుండా చేసింది. శ్రీను మరణించాడు.

Also Read: సత్యమే నా ఆయుధం: గుజరాత్ కోర్టులో ఊరట తర్వాత రాహుల్ గాంధీ రియాక్షన్ ఇదే

బండారి శ్రీను అన్న నరసింహా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోచంపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది. సాక్ష్యాధారలు కలెక్ట్ చేసుకుని చార్జిషీట్ ఫైల్ చేశారు. ఈ రోజు కోర్టు విచారిస్తూ దోషిగా తేల్చి జీవిత ఖైదు శిక్షను బవసరేఖకు విధించింది. రూ. 10వేల జరిమానా విధించింది.

click me!