గ్రేటర్ ప్రజలకు టిడిపి బంపర్ ఆఫర్

First Published Jun 13, 2017, 12:58 PM IST
Highlights

గ్రేటర్ హైదరాబాద్ పేద ప్రజలకు తెలంగాణ టిడిపి బంపర్ ఆఫర్  ప్రకటించింది. పేద ప్రజలు ముందుకొస్తే... తాము సహకరిస్తామని స్పష్టం చేసింది. ఇంతకూ ఆ బంపర్ ఆఫర్ ఏమిటని మీరు ఆలోచిస్తున్నారా..? అయితే ఈ స్టోరీ  చదవండి.

గ్రేటర్ ప్రజలు మియాపూర్ వివాదాస్పద భూములను ఆక్రమించుకోవాలని తెలంగాణ టిడిపి పిలుపునిచ్చింది. అలాంటి వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ప్రకటించింది. వివాదాస్పద భూమిని కాపాడడంలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టే తాము ఈ ప్రకటన ఇచ్చినట్లు టిడిపి నేతలు చెబుతున్నారు.

 

తెలంగాణలో సంచలనం రేకెత్తించిన మియాపూర్ భూకుంభకోణంపై టిడిపి తన ఆందోళనను తీవ్రతరం చేసింది. నిన్న కలెక్టరేట్ల ముట్టడి చేపట్టిన టిడిపి తాజాగా గవర్నర్ నర్సింహ్మన్ ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ఎఫ్ఐఆర్ లో గోల్డ్ స్టోన్ ప్రసాద్ పేరెందుకు పెట్టలేదని టిడిపి నేత రేవంత్ రెడ్డి ప్రకటించారు.  ఈ భూకుంభకోణం కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ పేరును ఎందుకు ఎఫ్ఐఆర్ లో పెట్టలేదుని నిలదీశారు. అసలు ఫిర్యాదులోనే ఆయన పేరు లేకపోవడమేందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  ఇంత జరుగుతుంటే... ఆ భూమిలో ప్రభుత్వ భూమి అని బోర్డు కూడా పెట్టలేకపోతున్నారెందుకో సమాధానం చెప్పాలన్నారు.

ఈ కేసును సిబిఐకి అప్పగించేవరకు విశ్రమించేదిలేదని టిడిపి అంటోంది. గోల్డ్ స్టోన్ ప్రసాద్ కనిపించడంలేదని ప్రభుత్వం చెప్పడాన్ని ఖండించారు టిడిపి నేత రేవంత్ రెడ్డి. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో గోల్డ్ స్టోన్ ప్రసాద్ పేరును ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ మీద ఉందన్నారు. సుప్రీంకోర్టులో 15000కోట్లకు సంబంధించిన కేసులో ప్రభుత్వం సాదాసీదా న్యాయవాదిని పెట్టారని ఆరోపించారు. ఈ కుంభకోణంపై కెసిఆర్ ఎందుకుమౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి కి మరియు రాష్ట్రపతి కి ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారు రేవంత్. ఏ కేసు నైనా నీరు కార్చేందుకే సిబిసిఐడి కి అప్పగిస్తున్నదని ఆరోపించారాయన.

click me!