దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకుందని.. అత్తగారింటినుంచి కుమార్తెను కిడ్నాప్ చేసి, గుండుకొట్టించి..

Published : Nov 15, 2022, 09:16 AM IST
దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకుందని.. అత్తగారింటినుంచి కుమార్తెను కిడ్నాప్ చేసి, గుండుకొట్టించి..

సారాంశం

తమకిష్టంలేని యువకుడిని ప్రేమపెళ్లి చేసుకుందని ఓ తల్లిదండ్రులు దారుణానికి తెగించారు. యువతిని అత్తగారింటినుంచి కిడ్నాప్ చేసి శిరోముండనం చేశారు. 

జగిత్యాల : తమ ఇష్టాన్ని కాదని, వేరే యువకుడిని పెళ్లాడిన కుమార్తె పట్ల ఆమె తల్లిదండ్రులు కర్కశంగా ప్రవర్తించారు. కన్నబిడ్డ అనే మమకారాన్ని కూడా మరిచి ఆమెను అత్తగారి ఇంటి నుంచి అపహరించారు. తీవ్రంగా కొట్టి కారులో తీసుకువెళుతూ శిరోముండనం చేశారు. రాత్రంతా ఆమె మనసు మార్చేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరికి వదిలిపెట్టారు. కన్నవాళ్ళు ఎన్ని హింసలు పెట్టినా  చివరికి కట్టుకున్నవాడే కావాలంటూ ఆ యువతి పోలీస్ స్టేషన్ కు చేరింది. జగిత్యాలలో ఆదివారం రాత్రి  కలకలం సృష్టించిన ఈ కిడ్నాప్ ను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. 

జగిత్యాల జిల్లా గ్రామీణ పోలీసుల కథనం మేరకు.. జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం బాలపల్లికి చెందిన జక్కుల మధు (23), రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన జువ్వాజి అక్షిత (20) ప్రేమించుకున్నారు. యువతి తల్లిదండ్రులు వీరి ప్రేమకు నిరాకరించడంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అక్షిత అత్తగారింట్లో ఉంది. ఆదివారం సాయంత్రం రెండు కార్లలో వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు మధు కుటుంబంపై దాడి చేసి యువతిని అపహరించుకుపోయారు. కారులో బలవంతంగా తీసుకు వెళుతూ వారు యువతిని తీవ్రంగా కొట్టారు.

విశాఖ నుంచి వందేభారత్ రైలు.. తిరుపతి లేదా విజయవాడ వరకు.. !

ఆమె కేకలు వేస్తున్నా వదలలేదు. కన్న కూతురు అన్న కనికరం చూపించలేదు. తమ పరువు, ప్రతిష్టలే ముఖ్యంగా భావించారు. పగవారికి కూడా చేయడానికి తలపెట్టలేని విధంగా ఆమెకు శిరోముండనం చేశారు. ఆ తరువాత రాత్రంతా ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించారు. ఆమె వినకపోవడంతో వదిలేసి వెళ్లిపోయారు. దీంతో సోమవారం ఉదయం ఆమె జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ చేరుకుంది. తనకు జరిగినఘాతుకాన్ని పోలీసులకు వివరించింది. ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్ఐ అనిల్ న్యాయం చేస్తామని  బాధితురాలికి హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆమె భర్తకు ఆమెను అప్పగించామని, ఆమె తల్లిదండ్రుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu