మోడీ భయపడ్డారు.. అందుకే ఆగమేఘాలపై దక్షిణాదికి : రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Nov 14, 2022, 09:23 PM IST
మోడీ భయపడ్డారు.. అందుకే ఆగమేఘాలపై దక్షిణాదికి : రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు

సారాంశం

ఏపీ, తెలంగాణల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు వస్తోన్న ఆదరణ చూసి మోడీ భయపడ్డారని ఆమె అన్నారు. 

గతవారం తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వరుస పర్యటనలు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకున్న సంగతి తెలిసిందే. మునుగోడు ఉపఎన్నిక తర్వాత తెలంగాణకు రావడం.. అటు ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం నేపథ్యంలో విశాఖకు రావడం రెండూ ప్రాధాన్యత వున్న విషయాలే కావడంతో మోడీ ఏం చెబుతారోనని జనం ఉత్కంఠగా ఎదురుచూశారు. తీరా మోడీ పర్యటనలో ఎలాంటి మెరుపులు లేవు.. వచ్చారు వెళ్లారు అన్నట్లుగా సాగింది. 

తాజాగా మోడీ పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . మోడీ పర్యటన తెలుగు రాష్ట్రాల్లో అత్యవసరమన్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర దక్షిణ భారతదేశంలో ముగిసిందని.. ఈ పాదయాత్రకు లభించిన స్పందనకు బీజేపీ భయపడుతోందని రేణుక అన్నారు. అందుకే మోడీ దక్షిణాది పర్యటనకు ఆగమేఘాల మీద వచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. 

అంతకుముందు శనివారం నూతనంగా నిర్మించిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదని మెజార్టీ వాటా రాష్ట్రానిది అయితే కేంద్రం ఎలా విక్రయిస్తుందని మోడీ ప్రశ్నించారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదని ప్రధాని పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్ట్‌లతో జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు ప్రధాని . 

ALso REad:సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్రానిదే.. మేం ఎలా ప్రైవేటీకరణ చేస్తాం : మోడీ

ప్రపంచంలోనే మూడో ఆర్ధిక వ్యవస్థగా భారత్ అవతరించిందన్నారు. ఫర్టిలైజర్ ప్లాంట్, రైల్వేలైన్, రోడ్ల విస్తరణతో తెలంగాణకు ఎంతో మేలు కలుగుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కూడా లభించాయన్నారు. 8 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకే ప్రాధాన్యం ఇచ్చామని ప్రధాని తెలిపారు. అభివృద్ధి పనుల మంజూరు ప్రక్రియలో వేగం పెంచామని.. తాము శంకుస్థాపనలకే పరిమితం కాలేదని, వాటిని వేగంగా పూర్తి చేసి చూపించాలమని మోడీ పేర్కొన్నారు. 

రామగుండం ఎరువుల కర్మాగారానికి 2016లో శంకుస్థాపన చేశామని.. రైతులకు ఎరువుల కొరత రాకుండా అనేక చర్యలు చేపట్టామని ప్రధాని తెలిపారు. యూరియాను విదేశాల నుంచి అధిక ధరకు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని.. తక్కువ ధరకే నీమ్ కోటింగ్ యూరియాను అందిస్తున్నామని మోడీ స్పష్టం చేశారు. భూసార పరీక్షలు చేసి రైతులకు కార్డులు అందిస్తున్నామని.. నేల స్వభావాన్ని బట్టి రైతులు పంటలు వేసుకునేలా చర్యలు చేపట్టామని ప్రధాని పేర్కొన్నారు. 

5 ప్రాంతాల్లోని ఎరువుల కర్మాగారాల్లో 70 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి  జరుగుతోందన్నారు. నానో యూరియా టెక్నాలజీని రైతులకు అందుబాటులోకి తెచ్చామన్న ఆయన... 2014 కంటే ముందు యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడేవాళ్లని ప్రధాని వెల్లడించారు. తాము తీసుకున్న చర్యలతో యూరియా నల్లబజారు మార్కెట్ బంద్ అయ్యిందన్నారు. భవిష్యత్‌లో భారత్ యూరియా పేరిట ఒకటే బ్రాండ్ లభ్యమవుతుందని ప్రధాని చెప్పారు. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, నకిలీ లేకుండా చర్యలు తీసుకున్నామని.. ఖమ్మం జిల్లాలో మరో రైల్వే లైన్‌ను ప్రారంభించామని మోడీ తెలిపారు. కొత్త రైల్వే లైన్‌తో ప్రజలకు , విద్యుత్ రంగానికి ప్రయోజనమన్నారు. కొత్తగా చేపడుతున్న హైవేల విస్తరణ వల్ల ఎన్నో మార్పులు రానున్నాయని.. సింగరేణి విషయంలో కొందరు అబద్దాలు చెబుతున్నారని మోడీ ఎద్దేవా చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం