కేంద్ర ప్రభుత్వంపై పరకాల ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై పరకాల ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. హైద్రాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో సంక్షోభంలో గణతంత్రం-విశ్లేషణ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పరకాల ప్రభాకర్ ప్రసంగించారు. దేశం అత్యంత సంక్షోభంలో ఉందన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని ఆయన చెప్పారు. మతం మత్తులో దేశం ఊగిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. కేంద్రంలో ఒక్క ముస్లి మంత్రి లేడన్నారు.
యూపీలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చైనా చొరబడినా, గంగానదిలో శవాలు తేలినా పట్టించుకోలేదని ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శించారు. ఎంతమంది వలస కార్మికులు చనిపోయారో లెక్కలున్నాయా అని ప్రశ్నించారు.నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. మతం ముసుగులో కొట్టుమిట్టాడుతున్నామన్నారు.పరకాల ప్రభాకర్ గతంలో బీజేపీ, పీఆర్‌పీలలో పనిచేసిన విషయం తెలిసిందే.