మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన అనుచరులను బెదిరిస్తూ ఖమ్మంలో పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఖమ్మం:కాంగ్రెస్ లో చేరుతున్నందుకు తనను, తన అనుచరులను బీఆర్ఎస్ బెదిరిస్తుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఖబడ్దార్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ ఖమ్మంలో వెలిసిన పోస్టర్ ను చూపుతూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.
also read:రేపు కాంగ్రెస్ సభ: గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుండి ఖమ్మానికి రాహుల్
ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాచరికంలో ఉన్నామా అని ఆయన ప్రశ్నించారు. అధికార మదంతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. తాను చెల్లని నాణెమో, గోల్డ్ కాయినో ఎన్నికల తర్వాత తేలనుందన్నారు. తాను పార్టీ మారితే నష్టం లేదని చెబుతున్న బీఆర్ఎస్ నేతలు ఎందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. రేపు ఖమ్మంలో కాంగ్రెస్ సభకు బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తుందని ఆయన చెప్పారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఖమ్మం సభను విజయవంతం చేస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
ఖమ్మంలో ఖబడ్దార్ పొంగులేటి అంటూ పోస్టర్లు
ఖమ్మంలో ఖబడ్దార్ పొంగులేటి అంటూ పోస్టర్లు వెలిశాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు మువ్వా విజయ్ కుమార్ ను కూడ బెదిరించారు. కార్తీక్ కు పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరించారు. మంత్రి అజయ్ కుమార్ పై విమర్శలను పోస్టర్లలో తప్పుబట్టారు. మంత్రి అజయ్ కుమార్ ను క్షమాపణలు కోరాలని కోరారు.