
ఖరీదైన బుల్లెట్ బైకులే వారి టార్గెట్. బుల్లెట్ కనిపించిందంటే చాలు. దానిని ఎలా ఎత్తుకుపోవాలా అని ఆలోచిస్తారు. చివరికి ప్లాన్ వేసి దాని సంగతెంటో చూస్తారు. తరువాత వాటిని దాచిపెట్టి రోజు వారి జీవనంలో పడిపోతారు. కానీ ఎన్ని రోజులని ఇలా దొంగతనాలు చేసి దర్జాగా తిరుగుతారు. ఓ రోజు వారిని పోలీసులు పట్టుకున్నారు. దీంతో వారు అప్పటి వరకు చేసిన దొంగతనాల వివరాలు అన్నీ వెల్లడించారు.
తెలంగాణకు చెందిన జవాన్ ఆత్మహత్య.. పంజాబ్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణం
వరుసగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ లు దొంగతనం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి నాలుగు బుల్లెట్ బైక్ లను స్వాధీనపర్చుకన్నారు. వాటి విలువ ఐదు లక్షలు ఉంటాయని చెప్పారు. ఈ నేరాలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేష్ (26) ఓ రెస్టారెంట్ లో వెయిటర్ గా జాబ్ చేస్తారు. అతడిని ఏపీలోని ఏలూరు జిల్లా. అతడికి మనోహర్ (21)అనే స్నేహితుడు ఉన్నాడు. అతడిరి సూర్యాపేట జిల్లా ఆత్మకూరు. వీరద్దరి మధ్య నాలుగేళ్ల స్నేహం ఉంది.
ఎస్ఐ, కానిస్టేబుల్ రాతపరీక్షల తేదీలు ఖరారు.. ఎప్పుడంటే..
వీరద్దరికీ డబ్బులు త్వరగా సంపాదించాలని కోరిక కలిగింది. దీని కోసం ఏం చేయాలా అని ఆలోచించారు. ఓ సులువైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఖరీదైన బైక్ లను దొంగతనం చేసి వాటిని అమ్మి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించారు. అనుకున్నదే లక్ష్యంగా పని మొదలు పెట్టారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌లు దొంగతనం చేయాలని ప్లాన్ చేసుకున్నారు. దీని కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఏప్రిల్ నెలలో వీరి దొంగతనాలు చేయడం ప్రారంభించారు. సరూర్‌నగర్, హయత్‌నగర్, జూబ్లీహిల్స్‌తో జాఫర్ అలీ బాగ్ లో ఒక్కో బైక్ దొంగతనం చేశారు.
ప్రేమించలేదని.. నడిరోడ్డుపై వివాహితపై కత్తితో యువకుడి దాడి...
అయితే జాఫర్ అలీ బాగ్ ఏరియా పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో వస్తుంది. ఇక్కడ బైక్ పోగొట్టుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తన బైక్ పోయిందని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తును స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో సాధారణ తనిఖీలో భాగంగా గురువారం సాయంత్రం పంజాగుట్ట పోలీసులు వాహనాలను చెక్ చేశారు. అయితే అటు నుంచి ఇద్దరు నిందితులు ఓ బైక్ పై వచ్చారు. బైక్ కు సంబంధించిన పేపర్లు చూపించాలని పోలీసులు వారిని కోరారు. అయితే వారు భయపడి వింత వింత సమాధానాలు ఇచ్చారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వారిని పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి ఎంక్వేరీ చేశారు. దీంతో గతంలో వారు చేసిన దొంగతనాలు, వారి నేపథ్యం మొత్తం వివరించారు. ఆ దొంగతనం చేసిన బైక్ లను ఎలా అమ్మాలి ? వాటిని ఎవరు కొనుగోలు చేస్తారు అని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో నిందితులు పోలీసులకు దొరికిపోయారు. పోలీసులు వారిని శుక్రవారం రిమాండ్ కు పంపించారు.