తెలంగాణకు చెందిన జవాన్ ఆత్మహత్య.. పంజాబ్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణం

By Sumanth KanukulaFirst Published May 28, 2022, 9:51 AM IST
Highlights

పంజాబ్‌లోని Fazilkaలో ఓ బీఎస్‌ఎఫ్ జవాన్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడిని తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలం మర్రిపల్లికి చెందిన కన్నెబోయిన రాములుగా గుర్తించారు. 

పంజాబ్‌లోని Fazilkaలో ఓ బీఎస్‌ఎఫ్ జవాన్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడిని తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలం మర్రిపల్లికి చెందిన కన్నెబోయిన రాములుగా గుర్తించారు. జవాన్ రాములు మృతిపై అధికారులు అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనతో రాములు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నెల రోజుల క్రితమే రాములు తన భార్య, పిల్లలను తన వెంట తీసుకెళ్లినట్టుగా సమాచారం. అయితే అంతలోనే ఇలా జరగడంతో ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. 

రాములు బీఎస్‌ఎఫ్ 52వ బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడు బీఎస్‌ఎఫ్ కంటోన్మెంట్‌లో నివసిస్తున్నాడు. అక్కడే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకన్నాడు. బుల్లెట్ శబ్దం వినిపించడంతో.. అక్కడ ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. దీంతో ఇతర బీఎస్‌ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే కొద్దిసేపటికే రాములు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపింది. 

ఓ బీఎస్ఎఫ్ జవాన్ తన సర్వీస్ రివాల్వర్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. మృతుడిని తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్టుగా చెప్పారు. చనిపోయిన జవాన్ వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని తెలిపారు. జవాన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఇందుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇక, జవాన్ రాములు మృతిపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు.. మృతదేహాన్ని సివిల్ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.

click me!