సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్..

By Sairam IndurFirst Published Mar 23, 2024, 5:20 PM IST
Highlights

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ మరో అభ్యర్థిని ప్రకటించింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరును పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది.

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోసం అన్ని పార్టీలు తమ అభ్యర్థులను విడతల వారీగా ప్రకటిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఇటీవల 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అలాగే బీజేపీ కూడా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పలు విడతలుగా అభ్యర్థులను ఖారారు చేస్తుండగా.. తాజాగా సికింద్రబాద్ స్థానానికి ఆ పార్టీ సీనియర్ నేతను బరిలో నిలిపింది. 

తీహార్ జైలుకు స్వాగతం - కేజ్రీవాల్ కు సుఖేష్ చంద్రశేఖర్ సందేశం..

సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి సీనియర్ నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.పద్మారావు గౌడ్ ను బీఆర్ఎస్ రంగంలో దించింది. ఈ స్థానానికి పార్టీ అభ్యర్థిగా ఆయన పేరును బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ శనివారం ప్రకటించారు. నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన అనంతరం పద్మారావు పేరును ఖరారు చేశారు.

సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ప్రస్థుత శాసన సభ్యుడు ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు.

ఈ మేరకు పార్టీ శాసన సభ్యులు ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం ఈ నిర్ణయం… pic.twitter.com/8t1OkuGuyy

— BRS Party (@BRSparty)

రాష్ట్ర సాధన కోసం పోరాడిన రోజుల నుంచి పార్టీతో పద్మారావు గౌడ్ కు అనుబంధం ఉంది. దీంతో ఆయనే సికింద్రాబాద్ స్థానానికి సరైన వ్యక్తి అని బీఆర్ఎస్ భావించింది. పద్మారావు సీనియర్ నేత అని, నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని పార్టీ ఒక బీఆర్ఎస్ ఒక ప్రకటనలో తెలిపింది.

అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడుగుతున్నారు.. అరెస్టు చట్ట విరుద్ధం - కల్వకుంట్ల కవిత

కాగా.. బీఆర్ఎస్ శుక్రవారం కూడా రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో ఇటీవల బీఎస్పీకి తెలంగాణా చీఫ్ పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు చోటు దక్కింది. ఆయనకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కేసీఆర్ సూచించారు. అలాగే మరో మాజీ ఐఏఎస్ అధికారి పి. వెంకట రాంరెడ్డిని కూడా బరిలోనే నిలిపారు. ఆయనకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చోటు కల్పించారు. దీంతో ఈ జాబితాలో ఇద్దరు మాజీ సివిల్ సర్వెంట్లకు చోటు దక్కినట్టు అయ్యింది.

click me!