Osmania: ఉస్మానియా ఆస్పత్రిలో అత్యంత అరుదైన శస్త్ర చికిత్సలు !

By Mahesh RajamoniFirst Published Jan 17, 2022, 10:36 PM IST
Highlights

Osmania: రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్ లోని ఉస్మానియా జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రిలో వైద్యులు అత్యంత అరుదైన శ‌స్త్ర‌చికిత్స‌లు చేస్తూ.. రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు. ఈ క్ర‌మంలోనే అరుదైన జన్యుపరమైన వ్యాధి ప్రోగ్రెసివ్ ఫ్యామిలియల్ ఇంట్రాహెపాటిక్ కొలెస్టాసిస్ (పీఎఫ్‌ఐసీ)తో బాధపడుతున్న నలుగురు చిన్నారులకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (ఓజీహెచ్) వైద్యులు చికిత్స అందించారు.
 

Osmania: రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్ లోని ఉస్మానియా జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రిలో వైద్యులు అత్యంత అరుదైన శ‌స్త్ర‌చికిత్స‌లు చేస్తూ.. రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు. ఈ క్ర‌మంలోనే అరుదైన జన్యుపరమైన వ్యాధి ప్రోగ్రెసివ్ ఫ్యామిలియల్ ఇంట్రాహెపాటిక్ కొలెస్టాసిస్ (పీఎఫ్‌ఐసీ)తో బాధపడుతున్న నలుగురు చిన్నారులకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (ఓజీహెచ్) వైద్యులు చికిత్స అందించారు.

ప్రోగ్రెసివ్  ఫ్యామిలీల్ ఇంట్రహెపాటిక్ కొలిస్టేసిస్ (Progressive Familial Intrahepatic Cholestasis-PFIC) అనేది  కాలేయములో ఏర్పడే  అరుదైన  జన్యు లోప సమస్య . ముఖ్యంగా  చిన్న పిల్లలలో ఇటువంటి సమస్యలు చాల అరుదుగా కనపడుతుంటాయి. వీటి లోపము వల్ల కాలేయము దెబ్బతిని , క్యాన్సర్లు, ఇత‌ర అనారోగ్య‌ సమస్యలు రావ‌డంతో ప్రాణాలు పోయే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది. కాలేయము లో  జన్యు లోపము వలన పిత్త ఆమ్లం సరఫరా లో సమస్య తలెత్తుతుంది. సరఫరా సమస్య వలన కాలేయము దెబ్బతినడం, కొవ్వు సరిగా శోషణ జరగకపోవడం, విటమిన్ A D E K లోపాలు , సిర్రోసిస్ లివర్ , కాలేయ కాన్సర్ లు సంభవిస్తాయి. ముందుగా ఈ సమస్యలు గుర్తించకపోతే  కాలేయ మార్పిడి చేయవలసి ఉంటుంది. కాలేయానికి సిర్రోసిస్ రాక ముందే గుర్తిస్తే మనము  PARTIAL EXTERNAL  BILIARY DRAINAGE  (PEBD), ఇలియల్ ఎక్సక్లూషన్స్ శస్త్ర చికిత్సలు చేస్తే కాలేయ మార్పిడి అవసరం పడకుండా చేయచ్చున‌ని డాక్టర్ CH.మధుసూదన్ (ప్రొఫెస‌ర్‌,  విభాగాధిపతి, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటెరోలోజీ,ఉస్మానియా జనరల్ ఆస్పత్రి) వెల్ల‌డించారు.

ఈ త‌రహా కేసుల‌కు సంబంధించి న‌లుగురు చిన్నారుల‌కు చికిత్సలు చేసిన‌ట్టు తెలిపారు. ఖ‌మ్మంకు చెందిన  ఇద్దరు అన్నదమ్ముళ్ల‌కు  ఇలియల్ ఎక్సక్లూషన్ శస్త్ర చికిత్స లు చేశారు. కరీంనగర్ చెందిన ఒక పిల్ల వాడికి లివింగ్ డోనార్ కాలేయ మార్పిడి చేశారు, ఇటువంటి శస్త్ర చికిత్సలు దేశంలో చాలా త‌క్కువ‌గా జ‌రుగుతుంటాయి. ఇద్దరు పిల్లల్లో ఒకరు విజయ్ 14 సంవత్సరాలు , సిద్ధార్థ్ 16 సంవత్సరాలు. ఖ‌మ్మంలోని  దన్వారి పాలెంకు చెందిన వారు.  వీరికి దురదలు , పసిరికలు, ఎదుగుదల లోపాలతో చాలా చోట్ల చాలా ఆస్పత్రులలో చూపించారు. ఎక్కడకు వెళ్లిన వారికి కాలేయ మార్పిడి చేయాలని సూచించారు. తల్లిదండ్రులు పేద వాళ్ళు కావటం ,వృత్తి రీత్యా కూలి వారు, మేనరికం పెళ్లి గా చెప్పడం జరిగింది. పిల్లలను అవసరమైన  వైద్యపరీక్షలు నిర్వహించిన తర్వాత‌ కాలేయంకు సిర్రోసిస్ లేదు అని తెలిసిన తరువాత మేము ఇలియల్ ఎక్సక్లూషన్ శస్త్ర చికిత్స  చేశారు. 

ఇక కరీంనగర్ కి చెందిన  సంవత్సరం వయసు గల మాస్టర్ వివాన్ ఆస్పత్రికి తీవ్రమైన కాలేయ సిర్రోసిస్ తో ప్రవేశం పొంది ,తన తల్లి  కొద్దిభాగం కాలేయాన్ని దానం చేయడం వలన మేము లివింగ్ డోనర్ కాలేయ మార్పిడి చేసామ‌ని వైద్యులు వెల్ల‌డించారు. మ‌రో 8 ఏండ్ల చిన్నారి ఆలమ్ రక్తపు వాంతులు , పసిరికలు ,కోమా, షాక్ లో ఇక్కడ ఆస్పత్రిలో చేరాడ‌ని, ఈరింద‌రికి విజ‌య‌వంతంగా త‌మ విభాగంలో  శస్త్ర చికిత్సలు చేశామ‌ని డాక్టర్ CH.మధుసూదన్ వెల్ల‌డించారు. త‌న టీంలో డాక్టర్ పాండు నాయక్ (ప్రొఫసర్, విభాగాధిపతి అనేస్తేషియా), డాక్టర్ రమేష్ కుమార్ డాక్టర్ జ్యోతి ,డాక్టర్ సుదర్శన్, డాక్టర్ వేణు ,డాక్టర్ వరుణ్ త‌దిత‌రులు ఉన్నార‌ని తెలిపారు. 

ఈ స‌మ‌స్య‌లు రావ‌డానికి కార‌ణాలు వివ‌రిస్తూ.. 
జన్యువులు ఆమ్లము తయారవడానికి ప్రోటీన్లు ఉత్పత్తి చేస్తాయి.వాటిని తిరిగి స‌ర‌ఫ‌రా చేసేందుకు తోడ్పడుతాయి. రకరకాల జన్యులోప సమస్యలు వలన ఈ ఉత్పత్తి, సరఫరాకు అడ్డంకులు తలెత్తుతాయి. ఆమ్లము  ఉత్పత్తి తగ్గిపోవడం, బ్లాక్ అవడం వల్ల‌ కాలేయము హానికారక వ్యర్థాలు తొలిగించలేక రక్తములో ఇవన్నీ ఉండిపోయి, సరిపడా కొవ్వును , విటమిన్లను  వినియోగించుకోలేద‌ని తెలిపారు. 

దీని ల‌క్ష‌ణాలు కింది విధంగా ఉంటాయ‌ని వివ‌రించారు. 
 1. తీవ్రమైన దురదలు, బరువు తగ్గడం, ఎదుగుదల తగ్గడం,
 2. పసిరికాలు, అలసిపోవడం, 
 3.  వైద్య పరీక్షలలో కాలేయము, ప్లిహం వాపు , పిత్తసాయం లో  రాళ్లు..ఇతరత్రా సమస్యలు ఉంటాయి. 

      అయితే, అన్ని వైద్య పరీక్షలనంతరం వైద్యులు కొందరికి మందులతోను న‌యం కావ‌డానికి అవ‌కాశ‌లు ఉండ‌గా, ఎక్కువ శాతం మందికి శస్త్ర చికిత్సలు అవసరమని పేర్కొన్నారు.  ముఖ్యంగా పైన తెలిపిన సమస్యలు ఉన్న రోగికి కాలేయ మార్పిడి తో  మంచి ఫలితాలు ఉంటాయ‌నీ, జీవితాన్ని పొడగించవచ్చున‌ని తెలిపారు. విజ‌య‌వంతంగా ఈ అరుదైన శ‌స్త్ర చికిత్స‌లు చేసిన అనంత‌రం డాక్టర్  CH.మధుసూదన్ మాట్లాడుతూ ముందుగా ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ కు కృతజ్ఞతలు తెలిపారు. వారు అడిగిన ప్రతి సారి  తక్షణమే స్పందించి, అందించిన సహాయ సహకారానికి  మనస్ఫూర్తిగా విభాగం తరపున ధన్యవాదములు  తెలిపారు. ఆస్పత్రి అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేణి, అడ్మినిస్ట్రేటివ్   విభాగం RMO1 డాక్టర్ బి శేషాద్రి, నర్సింగ్ స్టాఫ్, నాల్గవ తరగతి ఉద్యోగులకు అందరికి ధన్యవాదములు తెలిపారు.

Osmania ఆస్ప‌త్రి సూపరింటెండెంట్  డాక్టర్ బి నాగేందర్ గారు మాట్లాడుతూ ఉస్మానియా ఆస్పత్రి లో  నిష్ణాతులైన వైద్యులకు నిలయమనీ, ఎన్నో క్లిష్టమైన రోగాలకు, అరుదైన జబ్బులకు అందించిన  వైద్య చికిత్సలకు ,శస్త్ర చికిత్సలకు  ఉదాహరణలు ఎన్నో ఎన్నెన్నో.....అందుకే ఉస్మానియా ఆస్పత్రిలో  విద్యను అభ్యసించాలని ఇక్కడ ప్రాక్టీస్ చేసి నైపుణ్యం సాధించాలని యువ వైద్యులు  తపిస్తుంటారని తెలిపారు. అన్ని వేళల సహకరించి మమ్మల్ని ముందుకు నడుపుతున్న  గౌరవ వైద్య శాఖామాత్యులు టి.హరీష్ రావు గారికి ,తెలంగాణా ప్రభుత్వము, ప్రిన్సిపాల్ సెక్రటరీ ఫర్ హెల్త్, రిజ్వి, డాక్టర్ రమేష్  రెడ్డి  DMEల‌కు ప్ర‌త్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

click me!