ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

By narsimha lodeFirst Published Jan 17, 2022, 6:20 PM IST
Highlights

ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజుల నియంత్రణపై కొత్త చట్టం చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు అధ్యయనం చేసేందుకు  కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.

హైదరాబాద్: ప్రైవేట్ schools, జూనియర్ college డిగ్రీ కాలేజీల్లో fees నియంత్రణకు కొత్త చట్టం తీసుకు రావాలనిTelangana Cabinet నిర్ణయం తీసుకొంది. తెలంగాణ కేబినెట్ సమావేశం సోమవారం నాడు ప్రగతి భవన్ లో సీఎం Kcr అధ్యక్షతన జరిగింది.  ఈ సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలను తీసుకొంది కేబినెట్. వచ్చేవిద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధనకై కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. 

ఈ రెండు అంశాల పై పూర్తి అధ్యయనం చేసి  విధి విధానాలను రూపొందించేందుకు Cabinet Sub committee ఏర్పాటు చేసింది.తెలంగాణ విద్యాశాఖ మంత్రి Sabitha Indtra Reddy అధ్యక్షతన  ఈ కేబినెట్ సబ్ కమిటీ పనిచేస్తుంది. మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కెటిఆర్ లు ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు.  రానున్న శాసన సభా సమావేశాల్లో దీనికి సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్ల తో ‘ మన ఊరు – మన బడి  ప్రణాళిక  కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది.

 కేబినెట్స మావేశం ప్రారంభం కాగానే రాష్ట్రంలోCorona  పరిస్థితులపై కేబినెట్ కు మంత్రి హరీష్ రావు వివరించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వైద్య  ఆరోగ్య శాఖ సిద్దంగా ఉందని ఆయన చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.ఆదివారం నాడు రాష్ట్రంలో  రెండువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేబినెట్ లో చర్చించనుంది. ఇప్పటికే విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. తొలుత ఈ నెల 8 నుండి 16వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. అయితే కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు Holidays ఈ నెల 17 నుండి 30వ తేదీ వరకు పొడిగించారు.  

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం  కఠిన ఆంక్షలు అమలు చేయాలని భావిస్తోంది. night curfew విధించాలా లేదా కరోనా ఆంక్షలను మరింత కఠినతరం చేయాలా అనే విషయమై రాష్ట్ర కేబినెట్ లో చర్చించనున్నారు.

తెలంగాణలో కరోనా పరిస్థితులపై High Court  సోమవారం నాడు విచారణ చేపట్టింది.  ఈనెల 12 వరకు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. 

 ప్రతి రోజూ లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్రంలో క‌రోనా నియ‌మ నిబంద‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని సూచించారు. అలాగే.. భౌతికదూరం, మాస్కులు ధ‌రించ‌డం వంటి నిబంధ‌న‌లను క‌ఠిన‌త‌రం చేయాల‌ని సూచించారు. 

రోజురోజుకు క‌రోనా వ్యాప్తి వేగ వంతం అవుతున్న త‌రుణంలో నియంత్రణ చ‌ర్య‌ల‌ను క‌ఠిన‌త‌రంగా అమలు చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది.  కరోనా నియంత్రణపై ఇవాళ మంత్రివర్గం చర్చిస్తున్నట్లు Advocate General హైకోర్టుకు తెలిపారు. స‌మావేశ పూర్తివివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. 

click me!