కరోనాతో అనాథలైన చిన్నారుల పేరిట రూ. 10 లక్షలు.. డిసెంబర్‌ 31 వరకు దరఖాస్తులు స్వీకరణ.. కృతికా శుక్లా

Published : Oct 19, 2021, 11:48 AM IST
కరోనాతో అనాథలైన చిన్నారుల పేరిట రూ. 10 లక్షలు.. డిసెంబర్‌ 31 వరకు దరఖాస్తులు స్వీకరణ.. కృతికా శుక్లా

సారాంశం

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 లక్షలు చొప్పున బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయగా, వారికి 18 ఏళ్లు నిండగానే ఆమొత్తాన్ని తీసుకునే అవకాశం ఉందని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మరో రూ.10 లక్షల డిపాజిట్‌ 23 ఏళ్ల వయసు నిండిన తరువాత తీసుకునేలా ఉత్తర్వులు విడుదల అయ్యాయని Kritika Shukla అన్నారు. 

coronaతో అనాధలైన చిన్నారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న భరోసా, వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతుందని  రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. పిల్లల సమగ్ర సంరక్షణ, విద్య, ఉపాధి, వసతి వంటి సౌకర్యాలతో పాటు వారి పేరిట రూ.పది లక్షలు డిపాజిట్ చేసేలా కేంద్రం నుండి మార్గదర్శకాలు జారీ అయ్యాయన్నారు. 

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 లక్షలు చొప్పున బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయగా, వారికి 18 ఏళ్లు నిండగానే ఆమొత్తాన్ని తీసుకునే అవకాశం ఉందని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మరో రూ.10 లక్షల డిపాజిట్‌ 23 ఏళ్ల వయసు నిండిన తరువాత తీసుకునేలా ఉత్తర్వులు విడుదల అయ్యాయని Kritika Shukla అన్నారు. 

ఈ నేపధ్యంలో వారికి అవసరమైన సహకారం అందేలా వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేయనున్నామన్నారు. PM Care Scheme పథకానికి ఇప్పటికే కొందరు అర్హులను గుర్తించామని, అయితే ఈ సంవత్సరం డిసెంబర్‌ 31 వరకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని డాక్టర్ శుక్లా వివరించారు. 

పధకం మార్గదర్శకాలను వివరిస్తూ గత సంవత్సరం మార్చి 11 తరువాత తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన 18 ఏళ్లలోపు బాలలు ఈ పథకానికి అర్హులు కాగా,  వారికి రూ.10 లక్షల వంతున పోస్టాఫీసులో డిపాజిట్‌ చేసి, వారికి 18 సంవత్సరాలు నిండిన తరువాత 23 ఏళ్ల వరకు ఆ మొత్తంపై వచ్చే వడ్డీతో ఉపకార వేతనం అందిస్తామని,  23 ఏళ్లు నిండిన తర్వాత డిపాజిట్‌ మొత్తాన్ని వారికి ఇవ్వటం జరుగుతుందన్నారు.  

Orphaned children సమగ్ర సంరక్షణతోపాటు విద్య, ఆరోగ్యం, ఉపాధికి ప్రాధాన్యం కల్పించి, వారికి ఆరోగ్య బీమాతోపాటు ప్రమాద బీమా రూ.5 లక్షలు షైతం వర్తించేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. తొలుత పిల్లల సంరక్షణ కమిటీ సహాయంతో జిల్లా మేజిస్ట్రేట్ ద్వారా కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద Rehabilitation కల్పించేలా ప్రయత్నిస్తారని, వారితో జీవించడానికి ఇష్టపడకపోతే అనాధలుగా గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తామన్నారు. 

 పది సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలను నేతాజీ సుభాష్ చంద్ బోస్ ఆవాసియా విద్యాలయం,  కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, ఏకలవ్య మోడల్ స్కూల్స్, సైనిక్ స్కూల్, నవోదయ విద్యాలయం, జిల్లా మెజిస్ట్రేట్ ద్వారా ఏదైనా ఇతర రెసిడెన్షియల్ స్కూల్లో ప్రవేశాలు కల్పించి వారిని విద్యాధికులను చేస్తామన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇరువురు అనాధలు ఉంటే వారిని ఒకే చోట ఉంచుతామన్నారు.  


public schoolsలో, సమగ్ర శిక్షా అభియాన్ కింద రెండు సెట్ల ఉచిత యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందిస్తామని సంచాలకులు వివరించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్టిఇ చట్టం సెక్షన్ 12(1)(సి) కింద ట్యూషన్ ఫీజులు మినహాయించపు ఉంటుందని, ఈ పథకం ద్వారా యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌ల ఖర్చులను సైతం ప్రభుత్వమే భరిస్తుందన్నారు.  వీరికి ఉన్నత విద్యాభ్యాసం పరంగానూ సహాయం అందుతుందని, విద్యా రుణం పొందడంలో సహకారం, వడ్డీ మినహాయింపు అందిస్తామన్నారు. సామాజిక న్యాయం, సాధికారత, గిరిజన వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు, ఉన్నత విద్యా శాఖలు అమలు చేసే పధకాల నుండి నిబంధనల మేరకు ఉపకార వేతనాలు అందిస్తామన్నారు. 

ఆరోగ్య భీమా పరంగా Ayushman Bharat Scheme కింద పిల్లలందరినీ నమోదు చేసి రూ. 5 లక్షలు భీమా వర్తింప చేస్తామన్నారు. పిఎం కేర్స్ పధకం కింద ఇప్పటికే వివిధ జిల్లాలలో 237 మంది ఎంపిక పూర్తి అయ్యిందని డాక్టర్ కృతికా శుక్లా వివరించారు.  శ్రీకాకుళంలో 9, విజయనగరంలో 3, విశాఖపట్నంలో 33, తూర్పు గోదావరిలో 31,  పశ్చిమ గోదావరిలో 25, కృష్ణలో 22, గుంటూరులో 12, ప్రకాశంలో 12, నెల్లూరులో 18, చిత్తూరులో 16, వైఎస్ ఆర్ కడపలో 21, కర్నూలులో 9, అనంతపురంలో 26 మందిని ఎంపిక చేసామన్నారు. 

ప్రభుత్వ పధకాల కింద మద్దతు కోరుతూ రిజిస్టేషన్లకు అర్హులైన పిల్లలు చైల్డ్‌లైన్ 1098, జిల్లా బాలల సంరక్షణ యూనిట్ల నుండి పిలుపు అందిన 24 గంటలలోపు హాజరైతే, అర్హులైన పిల్లల ఆధార్ నమోదును సిడబ్యుసి నిర్ధారిస్తుందన్నారు. వీరిని పిఎం కేర్స్ పిల్లల సంరక్షణ పోర్టల్‌లో నమోదు చేసి అన్ని రకాల భద్రతలు కల్పిస్తామని Director, State Department of Women Development and Child Welfare డాక్టర్ కృతికా శుక్లా వివరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?