ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ, సియాటెల్ యూనివర్సిటీల మధ్య ఒప్పందం.. కొత్త భాగస్వామ్యానికి శ్రీకారం

By Mahesh KFirst Published Dec 10, 2022, 8:58 PM IST
Highlights

ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ, అమెరికాలోని సియాటెల్ యూనివర్సిటీల మధ్య ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఎంవోయూ విద్యార్థులకు, ఫ్యాకల్టీకి సరికొత్త, వినూత్నమైన అవకాశాలను అందుబాటులోకి తేనుంది. ఈ ఒప్పందం టీచింగ్, రీసెర్చ్, ఇతరత్రాల్లో ప్రయోజనాలను చేకూర్చనుంది.
 

న్యూఢిల్లీ: ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ, సియాటెల్ యూనివర్సిటీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యం కొత్త, వినూత్న అవకాశాలను ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు, బోధిస్తున్న ఫ్యాకల్టీకి కల్పించనుంది. ఈ ఒప్పందంతో సంయుక్త పరిశోధనలు, సంయుక్త ప్రచురణలు, లైబ్రరీ ఎక్స్‌చేంజ్‌లు, ఫ్యాకల్టీ, స్టూడెంట్ ప్రోగ్రామ్‌ల ఎక్స్‌చేంజ్, టీచింగ్, రీసెర్చ్‌లు మరింత బలోపేతం కానున్నట్టు ఓ ప్రకటనలో జిందాల్ వర్సిటీ పేర్కొంది.

విద్యాసంస్థల మధ్య స్కాలర్ల పరిచయాలు, సదస్సుల్లో పాల్గొనడం, లెక్చర్లు, సెమినార్లు నిర్వహించడం జరుగుతుంది. 

సియాటెల్ యూనివర్సిటీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ ఎడ్వార్డో ఎం పెనల్వార్, డీన్ ప్రొఫెసర్ ఆంథనీ ఈ వరోనా(స్కూల్ ఆఫ్ లా), డిపార్ట్‌మెంట్ల డీన్‌లు భారత పర్యటనలో ఉన్నారు. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో వీరికి ఆతిథ్యమిచ్చారు. ఇక్కడ ప్రొఫెసర్ ఎడ్వార్డో ఎం పెనల్వార్ మాట్లాడారు.

సియాటెల్ వర్సిటీ పసిఫిక్ నార్త్‌వెస్ట్‌లోనే అతిపెద్ద స్వతంత్ర విశ్వవిద్యాలయం అని ఎడ్వార్డో పెనల్వార్ తెలిపారు. కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్‌లలో తమ వర్సిటీ వేగంగా దూసుకెళ్లుతున్నదని వివరించారు. మా విద్యార్థులు మీ అనుభవంతో, మీ విద్యార్థులు మా అనుభవంతో నేర్చుకుంటారని, తద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఇండివిడ్యువల్ లెవల్ రిలేషన్‌షిప్స్ ఏర్పడుతాయని, అంతర్జాతీయ సవాళ్లను అధిగమించడానికి వారు సన్నద్ధులవుతారని అన్నారు.

Also Read: సత్తా చాటిన ఐఐటీ మద్రాస్ స్టూడెంట్స్, క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో 25 మందికి రూ.1 కోటి ప్యాకేజీ..

ఓపీ జిందాల్ యూనివర్సిటీ వ్యవస్థాపక వైస్ చాన్సిలర్, ప్రొఫెసర్ సీ రాజ్ కుమార్ మాట్లాడుతూ, భారత్‌లో ముఖ్యంగా ఉన్నత విద్యలో తెలంగాణ ముందు శ్రేణిలో ఉన్నదని అన్నారు. కాబట్టి, భారత్‌లోని విద్యాసంస్థలతో భాగస్వామ్యం నెలకొల్పాలని భావించే ప్రముఖ విదేశీ యూనివర్సిటీలు హైదరాబాద్ రావాల్సి ఉంటుందని వివరించారు. మెడికల్ సట్డీస్, ఇంజినీరింగ్ అండ్ సైన్స్, టెక్నాలజీ ఎడ్యుకేషన్‌లతోపాటు హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్‌లలోనూ తెలంగాణ లీడింగ్‌లో ఉన్నదని తెలిపారు. టీచింగ్, రీసెర్చ్, పరిశోధనా వాతావరణాన్ని అభివృద్ధి చేయడంలో భారత ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టిందని అన్నారు. అంతర్జాతీయీకరణ, అంతర్జాతీయ భాగస్వామ్యాలు నెలకొల్పడానికీ దేశ విద్యా విధానం ప్రోత్సహిస్తున్నదని వివరించారు. 

స్టూడెంట్ ఎక్స్‌చేంజెస్, ఫ్యాకల్టీ రీసెర్చ్ కొలాబరేషన్లు, ఇతర కార్యకలాపాల కోసం కాలేజీలు, యూనివర్సిటీలు ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్థలతో సంబంధాలు ఏర్పరుచుకోవాలని అమెరికన్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చెబుతున్నది.

click me!