ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్‌లోకి సంతానసాఫల్య నిపుణుడు డాక్టర్ కేడీ నయ్యర్

By Mahesh KFirst Published Dec 10, 2022, 8:02 PM IST
Highlights

ప్రముఖ సంతానసాఫల్య క్లినిక్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ఫెర్టిలిటీ క్లినిక్‌లో ప్రముఖ సంతాన సాఫల్య నిపుణుడు డాక్టర్ కేడీ నయ్యర్ చేరుతున్నారు. ఈ సందర్భంగా ఈ అంతర్జాతీయ క్లినిక్ ప్రతినిధులు హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఆయనను స్వాగతించారు.
 

హైదరాబాద్: ప్రముఖ సంతానసాఫల్య నిపుణుడు డాక్టర్ కేడీ నయ్యర్ అంతర్జాతీయంగా పేరు సంపాదించుకుంటున్న అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ) ఫెర్టిలిటీ క్లినిక్‌లో చేరుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైటెక్ సిటీలో హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆయనను ఏఆర్‌టీ క్లినిక్ సాదరంగా స్వాగతించింది. అనంతరం, డాక్టర్ కేడీ నయ్యర్, సంస్థ ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్, ఇండియా కో మెడికల్ డైరెక్టర్లు డాక్టర్ రిచా జగ్‌తప్, డాక్టర్ పరుల్ కతియార్, ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ హుమాన్ ఫతేమీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సంస్థ తొలుత 2015లో ఐవీఐ మిడిల్ ఈస్ట్ బ్రాండ్ పేరుతో ప్రారంభమై 2020లో ప్రస్తుత పేరుకు మారింది. సంస్థ స్థాపించినప్పటి నుంచి క్లినికల్ రిజల్ట్, పేషెంట్ సంతృప్తి, రీసెర్చ్, పునరుత్పత్తి, జన్యుశాస్త్రం రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలకు ఎదిగింది. మిడిల్ ఈస్ట్‌లో గణనీయమైన ఫలితాలు సాధించిన తర్వాత ఇతర దేశాలకూ సంస్థ విస్తరించింది. ఇందులో భాగంగా మన దేశంలో అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, గురుగ్రామ్, హైదరాబాద్, ముంబయిలలో ఆరు క్లినిక్‌లను స్థాపించింది. ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్‌కు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సక్సెస్ రేటు (70 శాతం) ఉన్నది.

ఈ సంస్థలో చేరుతున్న డాక్టర్ నయ్యర్ మాట్లాడుతూ, ఇది తనకు పెద్ద ముందడుగు అని, ఇందులో చేరడం సంతృప్తి ఇస్తుందని వివరించారు. క్లినిక్ ఎదుగుదలకు తాను దోహదపడగలనని అన్నారు. డాక్టర్ ఫతేమీ మాట్లాడుతూ, డాక్టర్ నయ్యర్‌ను స్వాగతించారు. ఆయన సమగ్రమైన అనుభవం విలువైనందని, దశాబ్దాల అనుభవంంలో ఎన్నో సమస్యలను పరిష్కరించారని చెప్పారు.

డాక్టర్ జగ్‌తప్ మాట్లాడుతూ, తమ బృందంలోకి డాక్టర్ నయ్యర్‌ను చేర్చుకోవడం సంతోషంగా ఉన్నదని, ఆయన విజ్ఞానం, అనుభవం, గణనీయమైన సక్సెస్ రేటును చూస్తే ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్ మన దేశంలో వేగంగా విస్తరిస్తుందని నమ్ముతున్నట్టు తెలిపారు. డాక్టర్ కతియార్ మాట్లాడుతూ, ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్‌లో అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులున్న డాక్టర్ నయ్యర్‌తో ఏఆర్‌టీ క్లినిక్స్ ప్రయోజనం పొందుతుందని, ఆయనతో కలిసి విజయాలను నమోదు చేయడానికి ఎదురుచూస్తున్నట్టు వివరించారు.

ఏఆర్‌టీ ఇండియా సీఈవో డాక్టర్ సోమేష్ మిట్టల్, కో మెడికల్ డైరెక్టర్లతో కలిసి డాక్టర్ నయ్యర్ అద్భుత నిపుణుడు అని వివరించారు. దేశ, విదేశాలకు చెందిన ఎంతో మందికి సంతానసాఫల్య చికిత్సలు చేశారని చెప్పారు. మన దేశంలో మెట్రో నగరాలతోపాటు ఇతర ప్రాంతాలకూ విస్తరించడానికి ఆయన సేవలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 

click me!