ఉల్లి కి కొరత లేదు

First Published Nov 18, 2016, 2:02 PM IST
Highlights
  • వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి

కరెన్సీ కొరత కారణంగా వస్తున్న సమస్యలని అధిగమించడానికి మలక్ పేట్ మార్కెట్ యార్డులో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా చేపట్టిన ఉల్లి అమ్మకాలు సత్ఫలితాలనిస్తున్నాయి. జోగులాంబ గద్వాల , వనపర్తి జిల్లాలలో రైతుల వద్ద నుంచి సేకరించిన 6400 బ్యాగుల ఉల్లిని హైదరాబాద్ లోని మలక్ పేట్ యార్డ్ లో  ఈ రోజు మార్కెటింగ్ శాఖ అధికారులు విక్రయించారు. కాగా, నగరంలోని 10 రైతు బజార్లలో కూడా సరిపడా ఉల్లి నిల్వలలు అందుబాటులో ఉన్నాయని, ఈ విషయంలో వినియోగదారులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి కె. రాజశేఖర్ రెడ్డి ఒక ప్రకటనల తెలిపారు.

 

click me!