బాలల రక్షణకు 1098 టోల్ ఫ్రీ

Published : Nov 18, 2016, 01:43 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
బాలల రక్షణకు 1098 టోల్ ఫ్రీ

సారాంశం

మూడేళ్ల నుంచి రాష్ట్రం మొత్తం మీద మహబూబ్ నగర్ జిల్లాలోనే చిన్నారులపై వేధింపుల కేసులు అత్యధికం

 

మహబూబ్ నగర్ జిల్లా నిజంగా వెనకబడిందే.   చిన్నారులపై నేరాలు  ఆందోళన కరంగా నమోదయ్యే జిల్లాను ఏమనాలి? ఈ జిల్లాలో  బాలల మీద  వేధింపులు ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో  నేరాలను అరికట్టి  చిల్డ్రన్ సేఫ్ జోన్ గా జిల్లాను మార్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 1098 పేరుతో ఒక టోల్ ఫ్రీ నంబర్ తో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు బాలికల రక్షణ కోసం మరిన్ని కార్యక్రమాలను చేపట్టారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను జిల్లా పోలీసులు శుక్రవారం నాడు విడుదల చేశారు.

 

ముఖ్యంగా గత మూడేళ్ల నుంచి రాష్ట్రం మొత్తం మీద మహబూబ్ నగర్ జిల్లాలోనే చిన్నారులపై వేధింపుల కేసులు అత్యధికంగా ఉన్నట్లు  జిల్లా క్రైం బ్యూరో నమోదు చేసింది.

 

2014లో 86 కేసులు నమోదవగా, 2015 లో 113 కేసులు 2016 లో ఇప్పటి వరకే 96 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది.  

 

గత మూడేళ్ల నుంచి గమనిస్తే రాష్ట్రంలోనే అత్యధికంగా 295 కేసులు ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో జిల్లాలో చిన్నారులపై వేధింపులను అరికట్టేందుకు పోలీసు సూపరింటెండెంట్ రెమా రాజేశ్వరి  తన బృందంతో రంగంలోకి దిగారు. సంస్కరణల విషయంలో ఎపుడూ ముందుండే రెమా ఈ సారి బాలల మీద జరిగే అకృత్యాల మీద యుధ్దం ప్రకటించారు.

 

నవంబర్ 20న అంతర్జాతీయ బాలల దినోత్సవం ను పురస్కరించుకొని నవంబర్ 18 నుంచి పది రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు రూపొందించారు. దీనికి సంబంధించి జిల్లా శుక్రవారం చైల్డ్ లైన్ ఇండియా పౌండేషన్ తో కలసి ‘బాల్యానికి రక్ష’ పేరుతో అవగాహన కార్యక్రమాన్ని ఆమె  ప్రారంభించారు.

 

10 రోజుల పాటు నిర్వహించే  ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా జూనియర్ కాలేజ్ లు,  కస్తూరిబా పాఠశాలలు, గ్రామీణ విద్యాసంస్థల్లో బాలల రక్షణ, హక్కుల పై చైతన్యం కలిగించే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. బాలల హక్కులపై చైతన్యపరచడం, వారు స్వేచ్ఛగా జీవించే వాతావరణం కల్పించడంమే లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సబ్ ఇన్స్ పెక్టర్లు తమ తమ స్టేషన్ల పరిధిలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లకు, కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలను సందర్శించి, అక్కడ  జరిగే అవాంఛనీయ సంఘటలను గురించి ధైర్యంగా ఫిర్యాదు చేసేలా వారికి ధైర్యం కలిగిస్తారు. అదే విధంగా అకృత్యాలు జరిగినపుడు ఎలాంటి చర్యలు తక్షణం తీసుకోవాలో కూడా పోలీసుల బాలికలకు వివరిస్తారు. ఈ కార్యక్రమాల ఉద్దేశం నేరాలు జరిగినపుడు ఫిర్యాదు చేసేందుకు వచ్చేలా వారిలో ధైర్య స్థయిర్యాలు కల్పించడం కోసం పోలీసులు ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇస్తారు.

 

 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఏపీలో సంక్రాంతి సెలవులు 9 కాదు 6 రోజులే..? తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్
మ‌రో హైదరాబాద్ నిర్మాణం.. గ్రీన్‌ఫీల్డ్ రోడ్లతో ఈ ప్రాంతాల్లో రియ‌ల్ ఎస్టేట్ జోరు ఖాయం