ఉల్లి కొరత లేదు

First Published Nov 16, 2016, 3:17 PM IST
Highlights
  • మార్కెట్ కమిటీ ఉన్నతి శ్రేణి కార్యదర్శి రాజశేఖర్
  • రైతు బజార్ల ద్వారా అమ్మకాలు చేపట్టినట్లు వెల్లడి

వినియోగదారులు ఉల్లి ధరలు పెరుగుతాయనే వదంతులు నమ్మవద్దని ప్రభుత్వమే నేరుగా వినియోగదారులకు ఉల్లి అమ్మకాలు చేపడుతుందని హైదరాబాద్ మార్కెట్ కమిటీ ఉన్నతి శ్రేణి కార్యదర్శి కె. రాజశేఖర్ రెడ్డి  ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు.

 

చిల్లర సమస్య కారణంగా మలక్ పేట్ మార్కెట్ యార్డులో ఉల్లిపాయల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిపివేయాలని కమిషన్ ఏజెంట్స్, కొనుగోలు దారులు నిర్ణయించడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు మలక్ పేట్ మార్కెట్ యార్డు, అలాగే ఫలక్ నుమా, సరూర్ నగర్, కూకట్ పల్లి, మెహదీపట్నం, వనస్థలిపురం, ఎర్రగడ్డ తదితర రైతు బజార్లలో ఉల్లి హోల్ సేల్ అలాగే రిటైల్ అమ్మకాలను తెలంగాణ మార్కెటింగ్ శాఖ నిర్వహించింది.

 

 

కాగా, గద్వాల్, వనపర్తి జిల్లాలకు చెందిన రైతుల నుంచి నేరుగా ప్రభుత్వం 200 టన్నుల ఉల్లి ని సేకరించి మలక్ పేట్ మార్కెట్ యార్డుకు తరలించిందని రాజశేకర్ రెడ్డి వివరించారు.  వాటి అమ్మకానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

 

click me!