
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట రాజీవ్ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనమయ్యారు.
కరీంనగర్ నుండి కీసర వైపు వెళ్తున్న ఇటుకల లోడు లారీ అదే మార్గంలో హైద్రాబాద్ నుండి తమిళనాడు సేలం కు వెళ్తున్న కంటైనర్ ను లారీని ఢీకొట్టింది.దీంతో ఇటుకల లారీ డీజీల్ ట్యాంకులో మంటలు చెలరేగాయి. రెండు వాహనాల మధ్య నిలబడి డ్రైవర్లకు సూచనలు ఇస్తున్న కంటైనర్ సూపర్ వైజర్ ముఖేష్ మంటల్లో సజీవదహనమయ్యాడు.
భోపాల్ నుండి తమిళనాడులోని సేలం విద్యుత్ ట్రాన్స్ పార్మర్లను తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన జితేందర్ ను గాంధీ ఆసుపత్రికి తరలించారు.
చోటుచేసుకుంది. రెండు లారీల మధ్య రాపిడి జరగడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. ఒక వ్యక్తి సజీవదహనమయ్యాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. . ఫైర్ ఇంజిన్ లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.