నమ్మితే నట్టేట ముంచాడు: జూలియట్ ఆత్మహత్యకు సోదరుడే కారణం

Published : Mar 11, 2021, 11:27 AM IST
నమ్మితే నట్టేట ముంచాడు: జూలియట్ ఆత్మహత్యకు సోదరుడే కారణం

సారాంశం

బంధువని నమ్మితే నట్టేట ముంచాడు. ఆమె వద్ద నుండి డబ్బులు కాజేశాడు. అంతేకాదు ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు. ఈ ఘటనకు కారణమైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.  


హైదరాబాద్: బంధువని నమ్మితే నట్టేట ముంచాడు. ఆమె వద్ద నుండి డబ్బులు కాజేశాడు. అంతేకాదు ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు. ఈ ఘటనకు కారణమైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైద్రాబాద్ నారాయణగూడ పోలిస్ స్టేషన్ పరిధిలోని బొగ్గులకుంటలో జూలియెట్ అనే మహిళ ఒంటరిగా ఉండేది. ఆమె దగ్గర కుటుంబ సభ్యులు లేరు. దీంతో ఆమెకు వరుసకు సోదరుడయ్యే జోసెఫ్ చేదోడువాదోడుగా ఉండేవాడు.  తనకు డబ్బులు అవసరమైన సమయంలో  తన బ్యాంకు డెబిట్ కార్డు, ఓటీపీ చెప్పి డబ్రులు డ్రా చేయించుకొనేది.

ఆమె ఫోన్ లో ఉన్న బ్యాంకు యాప్ ద్వారా కూడ జోసెఫ్  తన బ్యాంకు ఖాతాలోకి డబ్బులను మళ్లించాడు. ఇలా తన బ్యాంకు ఖాతా నుండి సుమారు రూ. 5 లక్షలను నిందితుడు కాజేశారు. తన ఖాతా నుండి రూ. 5 లక్షలు మాయమైన విషయాన్ని గుర్తించిన బాధితురాలు  సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ ఏడాది జనవరిలో ఫిర్యాదు చేసింది.

ఈ కేసు విచారణ సాగుతున్న సమయంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఆమె ఆత్మహత్య చేసుకొంది. ఈ కేసును నారాయణ గూడ పోలీసులు దర్యాప్తు చేశారు.ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. జోసెఫ్ మోసం చేశాడని పోలీసులు గుర్తించారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్