
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గురువారం నాడు బహిరంగ లేఖ రాశాడు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నూరుశాతం అమ్మేందుకు చేస్తున్న ప్రయత్నంపై ఏపీ ప్రజలు చేస్తున్న పోరాటానికి టీఆర్‌ఎస్ తరఫున మద్దతు తెలుపుతున్నామని మంత్రి కేటీఆర్ మద్ధతు ఉంటుందని బుధవారం నాడు ప్రకటించిన విషయం విదితమే.
అంతేకాదు.. అవసరమైతే సీఎం కేసీఆర్ అనుమతితో ఉద్యమంలో కూడా పాల్గొంటామని తెలిపారు. అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
also read:విశాఖ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు: ధన్యవాదాలు తెలిపిన గంటా
విశాఖ ఉక్కు పోరాటానికి మీ మద్దతు వెనుక దురుద్దేశం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధికోసమే ఈ ఎత్తుగడ వేశారని ఆయన ఆరోపించారు.
విభజన చట్టంలో రాష్ట్రానికి రావాల్సిన వాటిపై పోరాటం చేయరు. కానీ విశాఖ ఉక్కు కోసం పోరాడతారా? అని ఆయన ప్రశ్నించారు. మీ ఎంపీలు పార్లమెంటులో ఎందుకు పోరాటం చేయడం లేదని ఆయన అడిగారు.
also read:విశాఖ ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు: కేటీఆర్
జంతర్ మంతర్ వద్ద దీక్షకు కూడా రాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు హక్కుల గురించి గొంతు చించుకోవడం మాత్రం వచ్చా..?. అని ఆయన ఎద్దేవా చేశారు.
ఎన్నికలయ్యాక ఇచ్చిన హామీలను మరచిపోవడం మీకు మీ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. పెరిగిన నిత్యవసరాలు, గ్యాస్, పెట్రోల్ ధరల పెరుగుదలపై పార్లమెంట్‌లో పోరాటానికి మీ ఎంపీలు ముఖం చాటేశారని ఆయన విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోదీ అంటే భయపడుతున్నారా? రాజీ పడుతున్నారా? అని రేవంత్ ప్రశ్నించారు. బీజేపీపై గల్లీలో మీ మాటలకు ఢిల్లీలో చేతలకు పొంతన కుదరడం లేదని రేవంత్ రెడ్డి ఆ లేఖలో రాశారు.