చూస్తుండగానే వాగులో కొట్టుకుపోయిన కారు.. స్థానికుల రెస్క్యూ ఆపరేషన్, చివరికి

Siva Kodati |  
Published : Sep 10, 2022, 04:51 PM IST
చూస్తుండగానే వాగులో కొట్టుకుపోయిన కారు.. స్థానికుల రెస్క్యూ ఆపరేషన్, చివరికి

సారాంశం

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కారు వాగులో కొట్టుకుపోయిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కారు కామారెడ్డి నుంచి రామారెడ్డి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.   

భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి శివారులో వాగులో కారుపడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చూస్తుండగానే కారు వాగులో కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ కారులోని ఇద్దరిలో ఒకరిని మాత్రమే కాపాడగలిగారు. కారు కామారెడ్డి నుంచి రామారెడ్డి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 

మరోవైపు.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో వర్షం దంచికొడుతుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. ఇక, తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో పాటు, తెలంగాణ‌పై నైరుతి రుతుపవనాలు చురుగ్గా  కదులుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా  రెండు రోజులుగా హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపట్నంలో 20.90 సెం.మీల వర్షంకురిసింది. నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల్లో శనివారం అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోసారి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

ALso Read:అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో దండికొడుతున్న వానలు.. మరో రెండు రోజులు భారీ వర్ష సూచన..

అటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో శని, ఆదివారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలోని అనేకచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శని, ఆది వారాల్లో తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఇక, భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాలోని వేలాది ఎకరాల్లో పంటకు నష్టం చేకూరుతుంది. 
 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu
Holidays : ఈ వీక్ లో ఇంకా ఒక్కటే వర్కింగ్ డే.. మిగతా వారమంతా సెలవులే.. నెక్ట్స్ మండే వరకు ఎంజాయ్