సాయిప్రియ హత్య కేసులో ట్విస్ట్.. స్నాప్‌చాట్ ద్వారా ట్రాప్, ఆపై వనపర్తికి రప్పించి

Siva Kodati |  
Published : Sep 10, 2022, 04:26 PM ISTUpdated : Sep 10, 2022, 05:11 PM IST
సాయిప్రియ హత్య కేసులో ట్విస్ట్.. స్నాప్‌చాట్ ద్వారా ట్రాప్, ఆపై వనపర్తికి రప్పించి

సారాంశం

వనపర్తిలో దారుణ హత్యకు గురైన సాయిప్రియ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆమెను స్నాప్‌చాట్ ద్వారా ట్రాప్ చేసిన శ్రీశైలం వనపర్తికి రప్పించి, పెళ్లి చేసుకోవాలంటూ వేధించాడు.  

సాయి ప్రియ హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. తనను వివాహం చేసుకోవాలని శ్రీశైలం వేధింపులకు గురిచేశాడు. అతని వేధింపులు భరించలేక శ్రీశైలం ఫోన్ నెంబర్‌ను దాదాపు 6 నెలల పాటు బ్లాక్ చేసింది సాయిప్రియ. దీంతో స్నాప్ చాట్‌లో చాటింగ్ ద్వారా సాయిప్రియను వేధించాడు శ్రీశైలం. అయితే ఒకసారి కలుద్దామని చెప్పి వనపర్తికి రప్పించాడు శ్రీశైలం. దీంతో వనపర్తికి వెళ్లిన సాయిప్రియతో దాదాపు 2 గంటల పాటు మాట్లాడాడు శ్రీశైలం. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్తున్నానని ఆమె చెప్పింది... అయితే తనను పెళ్లి చేసుకున్న తర్వాత వెళ్లొచ్చని బలవంతం చేశాడు శ్రీశైలం. అయితే అతనిని పెళ్లి చేసుకునేందుకు సాయిప్రియ నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన అతను ఆమె చున్నీతోనే ఉరివేసి హత్య చేశాడు. అనంతరం బావమరిదితో కలిసి సాయిప్రియ మృతదేహాన్ని పాతిపెట్టాడు శ్రీశైలం. 

ఇకపోతే.. నాలుగు రోజుల క్రితం సాయిప్రియ హైదరాబాద్ నుంచి అదృశ్యమైంది. తనను వివాహం చేసుకోవాలని సాయిప్రియపై శ్రీశైలం ఒత్తిడి తీసుకొచ్చాడు. పెళ్లికి ఆమె ససేమిరా అనడంతోనే సాయిప్రియను హతమార్చాడు. అనంతరం వనపర్తి సమీపంలో సాయిప్రియ మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు శ్రీశైలం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నాలుగు రోజులుగా సాయిప్రియ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. చివరికి వనపర్తిలో సాయిప్రియ ఆచూకీ కనిపెట్టిన పోలీసులు.. ఆమె మృతదేహాన్ని వెలికి తీశారు. 


 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu
Holidays : ఈ వీక్ లో ఇంకా ఒక్కటే వర్కింగ్ డే.. మిగతా వారమంతా సెలవులే.. నెక్ట్స్ మండే వరకు ఎంజాయ్