Omicron: హైదరాబాద్ లోనే తొలి ఒమిక్రాన్ కేసు... ప్రచారంపై వైద్యారోగ్య శాఖ వివరణ

By Arun Kumar PFirst Published Dec 2, 2021, 2:19 PM IST
Highlights

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బయటపడినట్లు జరుగుతున్న ప్రచారంపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. 

హైదరాబాద్: ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసు హైదరాబాద్ లో బయటపడినట్లు జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ వైద్యారోగ్య శాఖ స్పందించింది. ఇటీవల బ్రిటన్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినమాట నిజమేనని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. అయితే ఇది ఒమిక్రాన్ గా నిర్దారణ కాలేదని... వైరస్ జినోమ్ సీక్వెన్స్ కోసం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా న్యూ వేరియంట్ Omicron ఇప్పటికే 20కి పైగా దేశాలలో వ్యాపించినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో వెంటనే అప్రమత్తమై రిస్క్ దేశాల నుంచి వచ్చిన 325 మంది విదేశీ ప్రయాణికులకు టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే బ్రిటన్ నుండి వచ్చిన ఓ 35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిందన్నారు. ఒమిక్రాన్ అనుమానంతో వైరస్ జినోమ్ సీక్వెన్స్ పరీక్షించడానికి ల్యాబ్ కు సాంపిల్స్ పంపించామని... ఫలితాలు రావడానికి రెండు రోజుల సమయం పడుతుందన్నారు. ప్రస్తుతం కరోనా నిర్దారణ అయిన మహిళకు టిమ్స్ లో ట్రీట్మెంట్ చేస్తున్నామని వెల్లడించారు. 

read more  Omicron: ఒమిక్రాన్ టెన్షన్.. అమెరికాలో తొలి కేసు.. 26 దేశాలకు పాకిన కొత్త వేరియంట్..

ఓమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమయ్యింది. మాస్క్, వ్యాక్సిన్ పై తెలంగాణ ప్రభుత్వ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయల జరిమానా వేయాలని పోలీసు శాఖకు వైద్యశాఖ సూచించింది. ప్రజలు మాస్క్ ఖచ్చితంగా ధరించేలా చూడాలని ఆదేశించింది. 

బహిరంగ ప్రదేశాలు, ఆఫీసుల్లో కూడా మాస్క్ లు ఖచ్చితంగా ధరించాలని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందేనని... ఖచ్చితమైన నిబంధనలు ప్రభుత్వ అనుమతితో రూపొందించబోతున్నట్లు వైద్య శాఖ ప్రకటించింది. హోటల్, పార్క్, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడికి వెళ్లినా వ్యాక్సినేషన్ పత్రం ఖచ్చితం చేయాలని నిర్ణయించింది. వ్యాక్సిన్ వేసుకొనివారికి ఎక్కడికెళ్లినా త్వరలో నో ఎంట్రీ రూల్ అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 

read more  ఒమిక్రాన్ య‌మ‌డెంజ‌ర్‌.. ద‌క్షిణాఫ్రికా శాస్త్ర‌వేత్త‌ల కొత్త హెచ్చ‌రిక‌లు

ప్రంపంచ దేశాలకు పెద్దన్నలాంటి అమెరికాను కూడా ఒమిక్రాన్ వదిలిపెట్టలేదు. తాజాగా USA లో తొలి ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదయ్యింది. దీంతో అగ్రరాజ్యం అప్రమత్తమై నిబంధనలను కఠినతరం చేసింది. దేశ ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించడంతో పాటు అంతర్జాతీయ ప్రయాణాలను ఆంక్షలు విధించింది.

south africa లో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడంతోనే ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. చాలా దేశాలు వెంటనే అంతర్జాతీయ ప్రయాణాలపనై ఆంక్షలు విధించాయి. దక్షిణాఫ్రికాతో పాటు ఈ వేరియంట్ గుర్తించిన దేశాలకు ప్రయాణాలపై నిషేధం విధించాయి. 

అయినప్పటికీ ఈ కొత్త వేరియంట్‌‌ విస్తరించకుండా (Omicron Widens) ఆపడం కష్టమే అనే సంకేతాలను కనిపిస్తున్నాయి. దేశాల మధ్య ప్రయాణిస్తున్న వ్యక్తులు, వారి కాంటాక్ట్స్ నుంచి ఈ వేరియంట్లు ఇప్పటికే సరిహద్దులు దాటి ప్రయాణించినట్టుగా తెలుస్తోంది. మరికొన్ని దేశాలకు కూడా ఈ వేరియంట్ విస్తరించిందని.. కొద్ది రోజుల్లోనే కేసులు వెలుగుచూస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

click me!