కోవిడ్ లక్షణాలు ఉన్నాయని గాంధీ ఆస్పత్రికి వెళ్లమన్నారు. శుక్రవారం రాత్రి 7గంటల సమయంలో నారాయణగూడలోని ఓ థియేటర్ సమీపంలోని హాస్టల్ గేటు వద్ద కింద పడి ఉన్నాడు. ఆకలి, అనారోగ్యంతో పడిపోయి ఉంటాడని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా.. అప్పటికే చనిపోయాడు.
నారాయణగూడ చౌరస్తాలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. కాగా.. ఆ వృద్ధుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆయన చొక్కా జేబులో అందుకు సంబంధించిన ఆధారాలను అధికారులు గుర్తించారు.
Also Readభార్య రూ.20 ఇవ్వలేదని.. భర్త ఆత్మహత్య...
పూర్తి వివరాల్లోకి వెళితే.. నేపాల్ కి చెందిన వృద్దుడు(77) లాలాపేటలో పనిచేస్తున్నాడు. దగ్గు, జ్వరం, శ్వాసకోస సమస్యలతో బాధపడుతుంటే.. మొదట స్థానిక ఏరియా ఆస్పత్రిలో చూపించుకున్నాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో కింగ్ కోఠి ఆస్పత్రికి వెళ్లమని సూచించారు. ఇద్దరు యువకుల సహాయంతో కోఠి ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు.
కోవిడ్ లక్షణాలు ఉన్నాయని గాంధీ ఆస్పత్రికి వెళ్లమన్నారు. శుక్రవారం రాత్రి 7గంటల సమయంలో నారాయణగూడలోని ఓ థియేటర్ సమీపంలోని హాస్టల్ గేటు వద్ద కింద పడి ఉన్నాడు. ఆకలి, అనారోగ్యంతో పడిపోయి ఉంటాడని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా.. అప్పటికే చనిపోయాడు.
అతని జేబులో కరోనా పాజిటివ్ గా రాసి ఉన్న డాక్టర్ రిపోర్టు చేసి పోలీసులు కంగుతిన్నారు. కాగా.. ఇప్పుడు అతను ఎక్కడెక్కడ.. ఏయే ప్రాంతాల్లో తిరిగాడో అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.