హైదరాబాద్ శివారులో దారుణం... వృద్దురాలిపై ఇద్దరు దుండగుల అత్యాచారం, హత్య

Arun Kumar P   | Asianet News
Published : Nov 25, 2021, 09:34 AM ISTUpdated : Nov 25, 2021, 09:47 AM IST
హైదరాబాద్ శివారులో దారుణం... వృద్దురాలిపై ఇద్దరు దుండగుల అత్యాచారం, హత్య

సారాంశం

వృద్దురాలిపై ఇద్దరు దుండగులు పాశవికంగా అత్యాచారానికి పాల్పడటమే కాదు అత్యంత దారుణంగా చంపిన దుర్ఘటన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది. 

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన వెలుగుచూసింది. వ‌ృద్దురాలిపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడటమే కాదు అతి దారుణంగా చంపి ఒంటిపై వున్న బంగారు, వెండి నగలను దోచుకెళ్లారు. అయితే ఈ వ్యవహారంలో వృద్దురాలి భర్త ప్రమేయం వున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే... hyderabad శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ తాామతిపేట్ కు చెందిన ఓ వృద్దురాలు దారుణ హత్యకు గురయ్యింది. అయితే ఆమె ఒంటిపై నగలు మాయమవడంతో ఇది దోపిడీదొంగల పనిగా అందరూ భావించారు. అయితే ఆమె పోస్టుమార్టం రిపోర్టులో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఆమెపై అత్యాచారం జరిపి ఆ తర్వాత హత్య చేసినట్లు తేలింది.  దీంతో పోలీసులు పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. 

వృద్దురాలి నివాసానికి సమీపంలోని సిసి కెమెరాలను పరిశీలించడంతో పాటు వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. శ్రీకాంత్‌, సురేష్‌ అనే ఇద్దరు దుండగులు వృద్దురాలిపై అత్యాచారం జరిపి హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులిద్దరిపై అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసులు పెట్టినట్లు వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి వెల్లడించారు.

read more  మైనర్ కూతురిపై అఘాయిత్యం, పెళ్లైనా వదలని కీచకతండ్రి.. మరణశిక్ష విధించిన కోర్టు...

అయితే కేవలం నగల కోసమే ఈ హత్యకు పాల్పడ్డారా లేక ఇతర ఏమయిన కారణాలున్నాయా అన్నదానిపై నిందితులను విచారిస్తున్నారు. వృద్దురాలి భర్తపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో భార్య హత్యలో అతడి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 

ఇదిలావుంటే ఇదే హైదరాబాద్ శివారులో మరో దారుణం వెలుగుచూసింది. వావివరసలు మరిచిన ఓ కసాయి తండ్రి కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిన కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే కట్టుకున్నవాడే కన్నకూతురి జీవితాన్ని నాశనం చేయడాన్ని ఉపేక్షించని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగుచూసింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.  

read more  కిలాడీ కపుల్... ఫేస్ బుక్ లో పరిచయమై, ప్రేమపేరుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను ముగ్గులోకి దింపి, కోటి స్వాహా....!

మోమిన్ పేట్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం పఠాన్ చెరుకు వెళ్లి అక్కడే ఉంటున్నారు. వీరి కుమార్తె కస్తూర్బా విద్యాలయంలో చదువుకుంటుంది. అయితే కరోనా కారణంగా ఇంటివద్దే వుంటున్న కూతురిపై కన్నేసాడు కసాయి తండ్రి.  ఒంటరిగా ఉన్న కూతురిని బెదిరించి మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. 

అయితే ఇటీవల కూతురు నీరసంగా ఉండటాన్ని గమనించిన తల్లి నాలుగు రోజుల క్రితం స్థానిక హాస్పిటల్ కి తీసుకువెళ్ళింది. అక్కడి వైద్యులు బాలికను పరీక్షలు నిర్వహించి ఆమె గర్భవతిగా తేల్చారు. దీంతో తల్లి నిలదీయగా బాలిక గతకొంతకాలంగా తనపై జరుగుతున్న అఘాయిత్య గురించి బయటపెట్టింది. తండ్రే తన మీద అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లితో తెలిపింది. దీంతో మంగళవారం రాత్రి తల్లి మోమిన్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu