మైనర్ కూతురి మీద కన్నతండ్రి అత్యాచారం.. గర్భం దాల్చడంతో...

Published : Nov 25, 2021, 09:34 AM IST
మైనర్ కూతురి మీద కన్నతండ్రి అత్యాచారం.. గర్భం దాల్చడంతో...

సారాంశం

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కన్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన వెలుగు చూడడంతో స్థానికంగా కలకలం రేగింది. 

మోమిన్ పేట్ :  రోజు రోజుకూ బాలికల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కన్నతండ్రులే కర్కశంగా వారి జీవితాల్ని నాశనం చేస్తున్నారు. వావివరసలు మరిచి కడుపుచించుకు పుట్టిన కూతురిలోనూ లైంగికతనే చూస్తున్నారు. ఇలాంటి దారుణ ఘటన హైదరాబాద్ శివారల్లో చోటుచేసుకుంది. 

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కన్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన వెలుగు చూడడంతో స్థానికంగా కలకలం రేగింది. 

మోమిన్ పేట్ వలయాధికారి వెంకటేశం బుధవారం తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ఓ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం Patan Cheru వెళ్లి అక్కడే ఉంటున్నారు. వీరి కుమార్తె కస్తూర్బా లో చదువుకుంటుంది. lock down కారణంగా ఇంటికి వచ్చేసింది. తండ్రి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేవాడు.

ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న కూతురిని బెదిరించి మూడు నెలలుగా sexual assault కి పాల్పడుతున్నాడు. బాలిక నాయనమ్మ  మృతి చెందడంతో తల్లిదండ్రులు స్వగ్రామానికి తిరిగివచ్చి స్థానికంగా కూలీ పనులు చేసుకుంటున్నారు. daughter నీరసంగా ఉండటాన్ని గమనించిన తల్లి నాలుగు రోజుల క్రితం స్థానిక hospitalకి తీసుకువెళ్ళింది. అక్కడి వైద్యులు బాలికను పరీక్షలు నిర్వహించి ఆమె pregnant అని చెప్పారు. దీంతో షాక్ కు గురైన తల్లి... కూతురిని తిట్టేసింది.

ఆ తరువాత ‘ఎవరినైనా మాప్రేమించావా చెప్పు.. వారి parentsతో మాట్లాడి నీకు పెళ్లి చేస్తామని* తల్లి గట్టిగా నిలదీసింది. దీంతో కూతురు ఏడుస్తూ పటాన్ చెరులో ఉన్నప్పుడు తండ్రే తన మీద అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యింది. మంగళవారం రాత్రి తల్లి మోమిన్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివాహామైన 24 గంటలకే విషాదం: అత్తారింటికెళ్తుండగా రోడ్డు ప్రమాదం, పెళ్లికుమారుడు మృతి.. కోమాలో వధువు

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ లోనూ ఇలాంటి దారుణమైన కేసులో అక్కడి కోర్టు తండ్రికి బుధవారం మరణశిక్ష విధించింది.  రాష్ట్రంలోని బహ్రైచ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తన Minor daughter మీద అత్యాచారం చేసిన 40 యేళ్ల కీచక తండ్రికి మరణశిక్ష విధిస్తూ Bahraich Court తీర్పు చెప్పింది. సంఘటన జరిగిన తరువాత మూడు నెలల లోపు తండ్రిని దోషిగా నిర్ధారించిన కోర్టు అదనపు సెషన్స్ జడ్జి నితిన్ కుమార్ పాండే శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని ప్రత్యేక జిల్లా ప్రభుత్వ న్యాయవాది సంత్ ప్రతాప్ సింగ్ చెప్పారు. 

మైనర్ కుమార్తెకు పెళ్లి చేశాక కూడా, ఆమెను ఇంటికి తీసుకువచ్చి అత్యాచారం చేశాడని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. 14యేళ్ల బాధిత బాలిక మీద సాక్షాత్తూ తండ్రి అత్యాచారం చేస్తుండగా బాలిక భర్త పట్టుకుని కేసు పెట్టాడు. గత రెండేళ్లుగా తండ్రి అత్యాచారం చేస్తున్నా బెదిరించడంతో బాధితురాలు మౌనంగా ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. 

Victimపాటు ఆమె కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టంలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. దోషికి Death sentenceతో పాటు 51వేల రూపాయల జరిమానా కూడా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu