ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన ఇద్దరు ఇండిపెండెంట్లు తమ నామినేషన్లను ఉపసంహరించుకొన్నారు. దీంతో ఈ రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ స్థానంలో నామినేషన్లు దాఖలు చేసిన ఇధ్దరు స్వతంత్ర అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకొన్నారు. దీంతో ఈ రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.ఈ రెండు స్థానాలు ఏకగ్రీవం కావడంతో రాష్ట్రంలోని ఐదు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుండి సిట్టింగ్ ఎమ్మెల్సీ kasireddy narayan reddy కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించారు.మరో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి స్థానంలో సింగర్ సాయిచంద్ కు అవకాశం కల్పించారు. అయితే చివరి నిమిషంలో ట్విస్ట్ చోటు చేసుకొంది. సాయిచంద్ స్థానంలో మరోసారి కూచకుళ్ల Damodar Reddy కి కేసీఆర్ అవకాశం ఇచ్చారు. దామోదర్ రెడ్డి Congress నుండి trs లో చేరే సమయంలో Mlc పదవి మరోసారి రెన్యూవల్ చేస్తామని టీఆర్ఎస్ నాయకత్వం హమీ ఇచ్చిన నేపథ్యంలో అనివార్యంగా ఎమ్మెల్సీ పదవిని రెన్యూవల్ చేశారని సమాచారం. ఉమ్మడి Mahabubnagar జిల్లాలో దాఖలైన నామినేషన్లలో ఆరు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మరో వైపు ఇవాళ మరో అభ్యర్ధి తమ నామినేషన్ ను ఉప సంహరించుకొన్నారు. దీంతో ఇద్దరు అభ్యర్ధులు ఏకగ్రీవమయ్యాయి. అయితే ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటంచాల్సి ఉంది.
also read:Telangana Local body Mlc elections: రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం
undefined
నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డిలు బుధవారం నాడే ఏకగ్రీవమయ్యారు. నిజామాబాద్ లో ఇండిపెండెంట్ నామినేషన్ తిరస్కరించారు. రంగారెడ్డి జిల్లాలో కూడా ఇండిపెండెంట్ నామినేషన్ తిరస్కరించారు. మరో వైపు ఇదే జిల్లాలో తాను నామినేషన్ దాఖలు చేయకుండా నామినేషన్ పత్రాలను చించివేశారని ఎంపీటీసీల సంఘం నేత నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి శశాంక్ గోయల్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయమై నివేదిక ఇవ్వాలని శశాంక్ గోయల్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. రాష్ట్రంలోని మొత్తం 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించే బలం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని జిల్లాల్లో తమ పార్టీ అభ్యర్ధులను బరిలోకి దింపింది. అయితే తమ పార్టీ ప్రజా ప్రతినిధుల ఓట్లు తమ అభ్యర్ధులకే పడేలా కాంగ్రెస్ పోటీకి దిగింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, బండా ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, వెంకట్రామిరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుండి మూడు రోజుల క్రితమే వీరంతా సర్టిఫికెట్లు అందుకొన్నారు.స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్ధులు ఐదుగురు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన ఏడు స్థానాల్లో పోటీపై ఇవాళ సాయంత్రానికి స్పష్టత రానుంది.