తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా మరో ఉన్నతాధికారికి ఇంటర్మీడియట్ బోర్డులో కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. బోర్డులో ఇప్పటి వరకు ఆరుగురికి కరోనా సోకింది.
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా మరో ఉన్నతాధికారికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఓ డ్రైవర్ కు, ఇద్దరు అటెండర్లకు కూడా కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే ఇద్దరు ఉన్నతాధికారులకు కోరనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇంటర్మీడియట్ బోర్డులో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఆరుకు చేరుకుంది.
ఇదిలావుంటే, ఈ రోజు, రేపు ప్రైవేట్ ల్యాబ్ ల్లో కరోనా వైరస్ పరీక్షలు నిలిపేస్తున్నారు. ఐసిఎంఆర్ నిబంధనలను ప్రైవేట్ ల్యాబ్ లు పాటించడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా వైరస్ పరీక్షలను లాబాపేక్ష దృష్టితో చూడకూడదని అంటోంది.
undefined
శుక్రవారంనాటి లెక్కల ప్రకారం... తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 12 వేలు దాటింది. మొత్తం 12,349 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ -19 మరణాల సంఖ్య 237కు చేరుకుంది. జిహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ విషం చిమ్మతోంది. జిహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 774 కేసులు నమోదయ్యాయి.
రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్ జిల్లాలో53, వరంగల్ అర్బన్ జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి. మెదక్ జిల్లాలో 9, ఆదిలాబాద్ జిల్లాలో 7, నాగర్ కర్నూలు జిల్లాలో ఆరు, నిజామాబాద్ జిల్లాలో 6, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6, సిద్ధిపేట జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.
ములుగు జిల్లాలో 2, వికారాబాద్ జిల్లాలో 1, జగిత్యాల జిల్లాలో 2, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3, ఖమ్మం జిల్లాలో 3, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2, మిర్యాలగుడాలో 1 కేసు నమోదయ్యాయి.