మరదలిపై కన్ను.. స్నేహితుడితో కలిసి అఘాయిత్యం

Published : Jun 27, 2020, 09:10 AM ISTUpdated : Jun 27, 2020, 09:14 AM IST
మరదలిపై కన్ను.. స్నేహితుడితో కలిసి అఘాయిత్యం

సారాంశం

ఇంటివద్ద దింపుతానంటూ ఆటోలో తీసుకెళ్లాడు. ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోయాక మరో ఆటోడ్రైవర్‌ (30)తో డీబీఆర్‌ మిల్స్‌ ప్రాంగణంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. 

సొంత మరదలిపై ఓ బావ కన్నేశాడు. ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. తనతోపాటు.. తన స్నేహితుడిని కూడా ఉసిగొల్పి.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేలా చేశాడు. కాగా.. ఉదంతంలో.. నిందితులిద్దరికీ జైలు శిక్ష పడింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

2015 అక్టోబరు 16న రాత్రి డీబీఆర్‌ మిల్స్‌ ప్రాంతానికి చెందిన ఓ ఆటోడ్రైవర్‌ (35) తన మరదలిని ఆమె ఇంటివద్ద దింపుతానంటూ ఆటోలో తీసుకెళ్లాడు. ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోయాక మరో ఆటోడ్రైవర్‌ (30)తో డీబీఆర్‌ మిల్స్‌ ప్రాంగణంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. 

అపస్మారక స్థితిలో ఉండగానే ఆమెను ఇంటి వద్ద వదిలిపెట్టాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ముషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. పకడ్బందీగా ఆధారాలు సేకరించి, చార్జిషీట్‌ దాఖలు చేశారు. పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు.. నిందితులిద్దరికీ చెరో 23 ఏళ్లు జైలు శిక్ష, రూ. 55 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చిందని ముషీరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.మురళీకృష్ణ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: వ‌చ్చే రెండు రోజులు భారీ వ‌ర్షాలు.. ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Sudden Rains in Hyderabad:హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు | Weather Update| Asianet News Telugu