తెలుగు టీవి ఛానల్లో అశ్లీల వీడియోల ప్రసారం... అవాక్కయిన ప్రేక్షకులు

By Arun Kumar P  |  First Published May 1, 2023, 12:37 PM IST

హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఓ తెలుగు టీవి ఛానల్లో అర్థరాత్రి అశ్లీల వీడియోల ప్రచారం కలకలం రేపుతోంది. 


హైదరాబాద్ : టీవి ఛానల్ లో అర్ధరాత్రి అశ్లీల వీడియోలు ప్రసారమైన ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. అయితే ఈ అశ్లీల వీడియోలను చూసినవారు వెంటనే ఛానల్ నిర్వహకులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఛానల్ సిబ్బంది అప్రమత్తమై వీడియో ప్రసారాన్ని నిలిపివేసారు.  

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలోని కార్యాలయంనుండి ఓ తెలుగు టీవీ ఛానెల్ కార్యకలాపాలు సాగిస్తోంది.రాజధాని హైదరాబాద్ తో పాటు పలుప్రాంతాల్లో ఈ ఛానల్ లైవ్ ప్రసారాలను అందిస్తుంది. అయితే ఇటీవల ఈ ఛానల్లో అశ్లీల వీడియోలు ప్రసారమవడం కలకలం రేపింది. 

Latest Videos

undefined

రెండు రోజుల క్రితం (ఏప్రిల్) 28న అర్థరాత్రి ఈ ఛానల్లో అశ్లీల వీడియోలు ప్రసారమవడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే ఛానల్ నిర్వహకులకు సమాచారం ఇచ్చారు.అయితే అప్పటికే 15 నిమిషాల పాటు అశ్లీల వీడియోల ప్రసారం కొనసాగింది. ఛానల్ నిర్వహకులు సిబ్బందిని అప్రమత్తం చేసి వీడియోల ప్రసారాన్ని నిలిపివేసారు. 

Read More  హైదరాబాద్ లో వ్యభిచార గృహంపై దాడి.. అదుపులో నలుగురు...

ఈ అశ్లీల వీడియోల ప్రసారంపై ఛానల్ నిర్వహకులకు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. తమ సర్వర్ ను హ్యాక్ చేయడమో, గుర్తు తెలియని వ్యక్తులు అప్ లోడ్ చేయడంవల్లనో ఈ వీడియోల ప్రసారం జరిగివుంటుందని పోలీసులకు తెలిపారు. తమ ఛానల్ ను అప్రతిష్టపాలు చేయాలని చూసినవారిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని సదరు టివి ఛానల్ నిర్వహకులు పోలీసులను కోరారు. 

ఇదిలావుంటే ఇటీవల రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారంపై యాడ్స్ ప్రసారం చేసే టివిలో ఫోర్న్ వీడియో ప్రసారమైన ఘటన బిహార్ లో వెలుగుచూసింది. బిహార్ రాజధాని పాట్నాలోని ఓ రైల్వే స్టేషన్లో రైళ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు టీవి చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. యాడ్స్ కు బదులు పోర్న్ వీడియో ప్రసారం కావడంతో ప్రయాణికులు మరీ ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇలా మూడు నిమిషాల పాటు పోర్న్ వీడియో ప్రసారం అయ్యింది.. 

పోర్న్ వీడియో ప్రసారాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రసారాన్ని నిలిపివేసారు. అయితే అప్పటికే కొందరు ప్రయాణికులు తమ సెల్ ఫోన్లలో ఈ ఉదంతాన్ని బంధించారు. దీంతో రైల్వే అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులు ఎంత ఇబ్బందిపడ్డారో బయటపడింది.  

  

click me!